Redmi: రూ. 14 వేల స్మార్ట్‌ఫోన్‌ను రూ. 7 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. అమెజాన్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్‌.

|

Oct 21, 2023 | 9:54 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్ సేల్‌ పేరుతో సేల్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దసరా పండుగను క్యాష్ చేసుకునే ఈ నేపథ్యంలో తీసుకొచ్చిన ఈ సేల్‌లో అన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఏకంగా 50 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 13,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు.

2 / 5
దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే ఈ ఫోన్‌పై అదనంగా 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇక మీ పాత ఫోన్‌ ఎక్స్చేంచ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 6,600 డిస్కౌంట్‌ పొందొచ్చు. 4జీ నెట్‌వర్క్‌కి ఈ స్మార్ట్ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది.

3 / 5
ఇక రెడ్‌మీ 12సీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌స్లేను అందించారు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇందులో 10 వాట్స్‌కి సపోర్ట్‌ చేసే 5000 ఎమ్ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 5 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ బరువు 192 గ్రాములుగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 39 గంటలు టాక్‌టైమ్‌ ఇస్తుంది. అలాగే 680 గంటలపాటు స్టాండ్‌బై అందిస్తుంది. మీడియా టెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.