Realme NARZO 70 Pro: రూ. 27 వేల ఫోన్‌ను రూ. 18,500కే పొందొచ్చు.. సూపర్ ఫీచర్స్‌.

|

Aug 12, 2024 | 10:09 PM

స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్‌ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్‌ సేల్‌ పేరుతో స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఇలాంటి ఓ బెస్ట్ డీల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ అందిస్తోన్న గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఈ సేల్‌లో భాగంగానే రియల్‌మీ నార్జో 70 ప్రో స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ డీల్‌ ఏంటి.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
రియల్ నార్జో 70 ప్రో 5జీ.. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ అసలు ధర రూ. 26,999కాగా ప్రస్తుతం అమెజాన్‌ సేల్‌లో భాగంగా 30 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 18,998కే సొంతం చేసుకోవచ్చు. అయితే దీంతో పాటు అమెజాన్‌ పే బ్యాక్‌ బ్యాలెన్స్‌తో పే చేస్తే అదనంగా మరో రూ. 570 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను అన్ని డిస్కౌంట్స్‌తో కలిపి రూ. 18,500కే సొంతం చేసుకోవచ్చు.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌లో కూడిన సోనీ ఐమ్యాక్స్‌890 నైట్ విజన్‌ కెమెరాను అందించారు. మెయిన్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ, 2ఎంపీతో కూడిన మరో రెండు కెమెరాలను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన 120 హెచ్‌జెడ్‌ అమోఎల్‌ఈడీ ఫుల్‌హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చారు. 2412 x 1080 పిక్సెల్స్‌ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఇందులో ఎయిర్ గెశ్చర్‌ అనే ఫీచర్‌ను ఇచ్చారు.

5 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 67 వాట్స్‌ ఫ్లాష్‌చేంజ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 11 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తి అవుతుందని కంపెనీ చెబుతోంది.