Missile System: యుద్ధం సమయంలో శత్రువును ఎదుర్కొనే ఉత్తమ క్షిపణి వ్యవస్థ ఉన్న 5 దేశాలు.. భారత్‌ ఏ స్థానమంటే..

|

Oct 06, 2024 | 11:39 AM

ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభం ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతను సృష్టించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రుల్లాను చంపిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్‌పై పడిన పలు క్షిపణులు బీభత్సం సృష్టించాయి. దీంతో మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే భయం ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఇజ్రాయెల్‌కు చెందిన యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ దీనికి కారణమని పేర్కొంది. మారుతున్న యుద్ధ స్వభావాన్ని బట్టి ప్రతి దేశం ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థను కలిగి ఉండాలి. ప్రపంచంలో ఏయే దేశాల్లో ఈ అధునాతన వ్యవస్థ ఉందో చూద్దాం..

1 / 5
చైనా:  చైనా HQ-9 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థను కలిగి ఉంది. శత్రు విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, ఉపరితల క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హెలికాప్టర్‌లను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. Hongqi-9 క్షిపణిని 1980ల ప్రారంభంలో అభివృద్ధి చేశారు. ఈ వ్యవస్థను అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ తరహాలో చైనా అభివృద్ధి చేసింది.

2 / 5
అమెరికా: పేట్రియాట్ ( MIM-104 ) US అభివృద్ధి చేసిన ఈ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ అన్ని రకాల వాతావరణంలోనూ పోరాడే సామర్థ్యం ఉంది. ఇది బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, అధునాతన విమానాలను ఎదుర్కోవడానికి అభివృద్ధి చేశారు. 1974లో అమెరికా తన సైన్యంలో ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఏకకాలంలో 100 క్షిపణులను గుర్తించి నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన ఫైర్ సబ్‌యూనిట్. ఇందులోలాంచర్లు (PU), నాలుగు క్షిపణులు ఉంటాయి.

3 / 5
ఇజ్రాయెల్: డేవిడ్ స్లింగ్ అనేది ఇజ్రాయెల్ వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థ. దీనిని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో గట్టి భద్రతను అందించే విధంగా తయారు చేశారు. ఇది ఇజ్రాయెల్ ఆయుధశాల జాబితాలో  MIM-23 హాక్, MIM-104 పేట్రియాట్‌లను చేర్చనుంది.

4 / 5
రష్యా: S-400 రక్షణ వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక క్షిపణి వ్యవస్థలలో ఒకటి. దీనిని 1990లలో రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. అయితే ప్రస్తుతం దీనికి హిట్-టు-కిల్ రక్షణ వ్యవస్థ లేదు. ఇందులో క్షిపణులు వచ్చే ముప్పును ఢీకొట్టి వాటిని నాశనం చేస్తాయి. భారత్‌లో ఎస్‌-400 క్షిపణి కూడా ఉంది.

5 / 5
భారతదేశం: మన దేశ వైమానిక రక్షణ వ్యవస్థ బలంగా ఉంది. భారతదేశం అధునాతన క్షిపణి నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇది స్వదేశీ టెక్నాలజీతో పాటు విదేశీ టెక్నాలజీ కూడా ఉంది. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ (PAD), అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ (AAD) భారతదేశ స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థలు. బాలిస్టిక్ క్షిపణి దాడులను అడ్డుకునేలా దీన్ని రూపొందించారు. ఆకాష్ క్షిపణి వ్యవస్థ ముప్పై కిలోమీటర్ల పరిధిలోని గగనతల శతృ క్షిపణులను ఎదుర్కొనే సామర్థ్యంతో తయారు చేశారు. ఇది ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. రష్యాకు చెందిన ఎస్-400 రక్షణ వ్యవస్థను భారత్ ఇటీవల కొనుగోలు చేసింది. ఇది బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో సహా వివిధ వైమానిక దాడులను అడ్డుకునే వ్యవస్థ. భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా బరాక్-8 వాయు రక్షణ వ్యవస్థను డెవలప్‌ చేశాయి.