Love Horoscope 2026: ప్రేమ ప్రయత్నాల్లో ఆ రాశుల వారికి విజయం ఖాయం..!

Edited By:

Updated on: Feb 09, 2026 | 7:21 PM

Valentine's Day 2026 Astrology: ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగార జీవితం, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం ఈ నెల 6న తన మిత్ర క్షేత్రమైన కుంభ రాశిలో ప్రవేశించడం జరిగింది. మార్చి 1 వరకు ఈ శుక్రుడి మీద గురువు దృష్టి పడుతోంది. ఫలితంగా ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డే లేదా ప్రేమికుల దినోత్సవం కొన్ని రాశుల వారికి నల్లేరు కాయల మీద బండిలా సాగిపోయే అవకాశం ఉంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ వ్యవహారాలు విజయం సాధిస్తాయని, పెళ్లిళ్లకు దారి తీస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రాశుల వారికి ఈ వాలెంటైన్స్ డే ఎలా గడుస్తుందన్నది ఆసక్తికర విషయం. మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారు మాత్రమే ప్రేమ ప్రయత్నాల్లోనూ, ప్రేమ వ్యవహారాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది.

1 / 6
మేషం: ఈ రాశికి కుటుంబ, సప్తమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ప్రవేశించడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి వాలైంటైన్స్ డే బాగా హ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశం ఉంది. రోజంతా విందులు వినోదాలతో సాగిపోతుంది. ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రేమల్లో ఉన్నవారు పెళ్లి ప్రయత్నాలు సాగించడం జరుగుతుంది. గ్రహ సంచార రీత్యా వీరు బాగా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తితో కులాంతర ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది.

2 / 6
వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం, దాన్ని ధన స్థానంలో నుంచి గురువు వీక్షించడం ఈ రాశివారు భోగ భాగ్యాలకు, సిరిసంపదలకు లోటు లేని వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరి ప్రేమ జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా సాగిపోతుంది. ప్రేమ జీవి తంలో భాగంగా ప్రేమ యాత్రలు సాగించే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారి ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీయడం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవడం జరుగుతుంది.

3 / 6
మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడి సంచారం, ఈ రాశి నుంచి గురువు వీక్షించడం వల్ల సాధా రణంగా దూరపు బంధువుతో గానీ, విదేశాల్లో ఉన్న వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంది. ప్రేమ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవితంలో అన్ని విధాలా స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. శుక్రుడి మీద గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశివారి ప్రేమ వ్యవహారాలు తప్పకుండా పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.

4 / 6
సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి ప్రవేశం, లాభ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. ఈ ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోవడంతో పాటు పెళ్లికి దారితీసే అవకాశం కూడా ఉంది. రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తితో గానీ, వ్యాపారంలో ఉన్న వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. కులాంతర ప్రేమ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ ప్రేమ వ్యవహారం తప్పకుండా సంప్రదాయబద్ధమైన వివాహానికి దారి తీస్తుంది.

5 / 6
తుల: ఈ రాశికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్న రాశ్యధిపతి శుక్రుని భాగ్య స్థానం నుంచి గురువు చూడడం ఒక విశేషం. సంప్రదాయబద్ధమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో గానీ, బంధువర్గానికి చెందిన వ్యక్తితో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంది. బంధువుల్లో కూడా బాగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. వీరి ప్రేమలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఈ ప్రేమలు పెళ్లికి దారితీయడంతో పాటు, వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది.

6 / 6
మకరం: ఈ రాశికి కుటుంబ స్థానంలో ప్రవేశిస్తున్న శుక్రుడిని గురువు చూడడం వల్ల సహోద్యోగితో లేదా పరిచయస్థుడితో ప్రేమలో పడే అవకాశం ఉంది. జీవితంలో అన్ని విధాలా స్థిరపడిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. ఈ రాశివారి ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఇవి తప్పకుండా పెళ్లికి దారితీయడం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోవడం జరుగుతుంది. అనేక పర్యాయాలు విహార, వినోద యాత్రలకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది.