రిస్క్ తీసుకుంటే సక్సస్ పక్కా.. ఉగాది తర్వాత వీరికి ఊహించని అదృష్టం..!

Edited By:

Updated on: Mar 09, 2026 | 6:02 PM

ఉగాదికి సమీపంలో మారుతున్న రవి, శుక్ర, కుజ గ్రహాలు కొన్ని రాశులను అందలాలు ఎక్కించబోతున్నాయి. ఈ గ్రహ మార్పు వల్ల కొన్నిరాశుల వారు ఎంత రిస్కు తీసుకోవడానికైనా సిద్ధపడి విజయాలు సాధించే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం వీరు సాఫల్యాలను మూటగట్టు కుంటారు. మేషం, సింహం, తుల, వృశ్చికం, ధనూ రాశులు. ఈ రాశుల అధిపతుల బలంతో పాటు, గురు బలం కూడా తోడవుతున్నందువల్ల వీరు ఎటువంటి సవాళ్లు, సమస్యలనైనా ఎదుర్కోగలుగుతారు. ఆదాయం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాల్లో వీరితో పోటీపడే వారుండరు.

1 / 5
మేషం: సహజ నాయకత్వ లక్షణాలు, సాహస ప్రవృత్తి కలిగిన ఈ రాశివారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబ డులు పెట్టడం, సవాళ్లకు అవకాశం ఉన్న ఉద్యోగాల్లోకి మారడం వంటివి చేసే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో భారీగా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాశ్యధిపతి కుజుడు పోరాటశీలి అయినందు వల్ల త్వరలో వీరు ప్రతికూలతలను లెక్క చేయకుండా దేనినైనా సాధించుకోగలుగుతారు. అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. సంపన్నుడు కావడం కూడా జరుగుతుంది.

2 / 5
సింహం: పట్టుదలకు, నాయకత్వానికి ప్రతిరూపమైన ఈ రాశివారు అష్టమ శని కారణంగా ఇబ్బందులు పడుతున్నా వృత్తి, వ్యాపారాలను నిర్వహించడంలో, ఆదాయాన్ని పెంచుకోవడంలో అందరి కంటే ముందుండే అవకాశం ఉంది. రాశ్యధిపతి రవి గ్రహ రాజు కావడం వల్ల వీరు ఎటువంటి సమస్యలు, సవాళ్లనైనా విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది.

3 / 5
తుల: వ్యాపార దక్షత, కార్యదక్షత కలిగిన ఈ రాశివారు ఎంత రిస్కు తీసుకుంటే అంత మంచిది. వీరు ఎంతో సాహసంతో చేపట్టే ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది.  ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులను వీరు పట్టుదలగా అధిగమిస్తారు. రాశ్యధిపతి శుక్రుడి దూరదృష్టి, వ్యూహాల వల్ల వీరు అనుకున్నది సాధిస్తారు. వీరు ఏ రంగంలో ఉన్నా ఒక వెలుగు వెలుగుతారు. వీరు కలలో కూడా ఊహించని అదృష్టవంతులవుతారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో పైచేయిగా ఉంటారు.

4 / 5
వృశ్చికం: సాహసాలు చేయడానికి, రిస్కు తీసుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు ఏ రంగంలో ఉన్నా దూసుకుపోయే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడికి బలం పెరుగుతున్నందు వల్ల ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది.

5 / 5
ధనుస్సు: ఎటువంటి చిన్న అవకాశాన్నయినా సద్వినియోగంచేసుకుని, గరిష్ఠ స్థాయిలో లాభాలు పొందే ఈ రాశివారు అతి తక్కువ కాలంలో బాగా పురోగతి చెందే అవకాశం ఉంది. రిస్కు తీసుకుని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లలో మదుపు చేయడం వంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రాశ్యధిపతి గురువుకు బలం పెరగడం వల్ల ప్రతి విషయంలో విజయాలు, సాఫల్యాలు సిద్దిస్తాయి. ఆదాయ వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

Follow Us