Solar Eclipse 2026: ఆర్థిక, అధికార యోగాలు..! సూర్య గ్రహణం తర్వాత వారి జాతకం మారనుంది

Edited By:

Updated on: Aug 11, 2026 | 1:05 PM

Solar Eclipse on August 12: ఆగస్టు 12న, అంటే అమావాస్య రోజున కర్కాటక రాశిలో అతి కొద్ది సూర్య గ్రహణం సంభవించబోతోంది. ఇది పాశ్చాత్య దేశాల్లో తప్ప భారతదేశంలో కనిపించే అవకాశం లేనప్పటికీ, జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహణ ప్రభావం స్వల్పంగా వివిధ రాశుల మీద పడడం జరుగుతుంది. సూర్య గ్రహణం రోజున ఉన్న గ్రహ సంచారం వల్ల మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. ఊహించని విధంగా ఆదాయం పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి.

1 / 6
మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సూర్య గ్రహణం సంభవిస్తున్నందువల్ల జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఊహించని శుభవార్తలు వింటారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. అనారోగ్య సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి.

2 / 6
కర్కాటకం: ఈ రాశిలో గ్రహణం సంభవించడం వల్ల అనేక విధాలుగా యోగాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సానుకూలంగా నెరవేరుతుంది. ఆదాయంలో అంచనాలకు మించిన వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడి లాభాల బాటపడతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి బాగా అనుకూలమవుతుంది.

3 / 6
సింహం: ఈ రాశికి వ్యయ స్థానంలో కొద్దిపాటి గ్రహణం ఏర్పడడం వల్ల ఉద్యోగులు, నిరుద్యోగులకు అతి త్వరలో విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. నెలాఖరులోగా జీవితంలో కొన్ని ముఖ్యమైన సాను కూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ముఖ్య మైన ఆర్థిక సమస్యలు, ఆర్థిక అవసరాలు తీరిపోయి ఊరట లభిస్తుంది. ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాలు కూడా సంతృప్తికరంగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శత్రు బాధ తగ్గుతుంది.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గ్రహణం సంభవిస్తున్నందువల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేపట్టినా లాభదాయకంగా నెరవేరుతుంది. ఆర్థికపరమైన కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ప్రముఖులతో ఉపయోగకర పరిచయాలు ఏర్పడ తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో హోదా, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం జరుగుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది.

5 / 6
ధనుస్సు: అష్టమ స్థానంలో ఈ రాశికి గ్రహణం ఏర్పడడం వల్ల మనసులోని కోరికలు కొన్ని నెరవేరుతాయి. రాజయోగం పడుతుంది. ఉద్యోగ సంబంధమైన ప్రతి ప్రయత్నమూ సానుకూలంగా నెరవేరు తుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.

6 / 6
కుంభం: ఈ రాశికి షష్ట స్థానంలో గ్రహణం సంభవించడం వల్ల ఆస్తి కలిసి రావడం గానీ, వారసత్వ సంపద లభించడం గానీ జరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆస్తిని కొనడం, గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెట్టడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు వృద్ధి చెందుతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us