
మేష రాశి : మేష రాశి వారికి రాఖీ పండుగ తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం ఊహించని విధంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు కాంట్రాక్టులు కలిసి వస్తాయి. ఈ రాశి వారు తెలివి తేటల ద్వారా ఉన్నత స్థాయిలోఉంటారు. అన్నివిధాలుగా అద్భుతంగా కలిసి వస్తుంది.

మీన రాశి : మీన రాశి విద్యార్థులకు ఇది మంచి సమయం. వీరు చాలా త్వరగా తమ పనులను పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అనుకోని విధంగా ఈ రాశి వారు ఏ కోరికలు అయితే నెరవేర్చుకోవాలి అనుకున్నారో, వాటిని నెరవేర్చుకుంటారు. అన్నింట్లో మంచి ఫలితాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి పట్టింది బంగారం ముట్టింది ముత్యమే అవుతుంది. వీరు స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా కలిసి వస్తుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు