Lord Shiva: పరమ శివుడికి ఇష్టమైన రాశులివే..! మహాశివరాత్రి నుంచి మంచి రోజులు..

Edited By:

Updated on: Feb 07, 2026 | 3:47 PM

Mahashivratri 2026: ఆధ్యాత్మిక జ్యోతిష సూత్రాల ప్రకారం దేవుళ్లకు కూడా ఇష్టమైన రాశులున్నాయి. ఆ రాశులవారు తమను ఇష్టపడే దేవుళ్లను భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా కొన్ని గ్రహ దోషాలు, అవయోగాలు తొలగిపోతాయి. ఫిబ్రవరి 15న వచ్చే మహా శివరాత్రిని దృష్టిలో పెట్టుకుని చూస్తే, పరమశివుడికి ఇష్టమైన రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశులు. వీరు మహా శివరాత్రి రోజున శివుడిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తే అంత మంచిది. వీరికి ఈ ఏడాది శివరాత్రి తర్వాత నుంచి యోగ కాలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

1 / 6
మేషం: రాశ్యధిపతి కుజుడంటే భోళాశంకరుడికి ఎంతో ఇష్టం. కొద్దిపాటి పూజ, ప్రార్థనలతో శివుడు ఈ రాశివారిని ధన ధాన్యాలతో బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్లడం వల్ల వీరికి అనేక విధాలుగా సంపద పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి.

2 / 6
కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు శివుడికి అత్యంత సన్నిహితుడైనందువల్ల సాధారణ పూజలు, అభిషేకానికి కూడా శివుడు ఈ రాశివారిని అనుగ్రహించే అవకాశం ఉంది. చంద్రుడు ఆరోగ్యానికి, శివుడు ఐశ్వర్యానికి అధిష్ఠాన దేవతలైనందువల్ల ఈ రాశివారికి మహా శివరాత్రి నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు, అవకాశాలు లభించే అవకాశం ఉంది.

3 / 6
సింహం: రాశ్యధిపతి రవికి పరమ శివుడు మిత్రుడైనందువల్ల శివస్తోత్ర పఠనంతో శివుడికి ఈ రాశివారు ప్రీతిపాత్రులవుతారు. వీరికి శివుడు అనుగ్రహం లభించే పక్షంలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.

4 / 6
వృశ్చికం: రాశ్యధిపతి కుజుడితో సాన్నిహిత్యం కారణంగా శివుడు ఈ రాశివారికి కొద్దిపాటి ప్రార్థనతో బాగా అనుగ్రహించే అవకాశం ఉంది. శివరాత్రి రోజున వీరు శివుడిని మనసారా పూజించడం వల్ల ఆదా యం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. మనసులోని కోరికలు, కొన్ని కలలు నెరవేరడం జరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

5 / 6
మకరం: రాశ్యధిపతి శని పరమ శివుడి భక్తుడైనందువల్ల ఈ రాశివారికి మహా శివరాత్రి నుంచి దశ తిరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి శివ పూజతో వీరికి అపారంగా కలిసి వస్తుంది. ఊహించని అదృష్టాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ధన వర్షం కురిపిస్తాయి.

6 / 6
మీనం: రాశ్యధిపతి గురువు సాక్షాత్తూ దేవ గురువు అయినందువల్ల ఈ రాశివారు మహా శివరాత్రి పూజల తర్వాత తప్పకుండా శివుడి అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. గురు బలం పెరగడం తప్పకుండా అదృష్టాన్ని కలుగజేస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు మటుమాయం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా శీఘ్ర పురోగతి ఉంటుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది.