AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే చంద్రగ్రహణం.. గ్రహణం పూర్తైన తర్వాత తప్పక చేయాల్సిన నాలుగు పనులివే

ఖగోళ వింత అయిన గ్రహణాలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే గ్రహణానికి 9 గంటల ముందు నుంచి సూతక కాలం ప్రారంభం అవుతుంది. అందువలన ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. కాగా, దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 27, 2026 | 4:16 PM

Share
గ్రహణం సమయంలో  ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెబుతుంటారు. అందుకే  ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా గ్రహణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా కొన్ని పనులు చేయాలంట. అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
గ్రహణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలంట. శుభ్రమైన బట్టలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. దీని వలన ప్రతి కూల శక్తుల ప్రభావం తొలిగిపోయి సానుకూలత పెరుగుతుంది.  ఇంటిలో ఉన్న వారు అందరూ కూడా తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి.

2 / 5
అదే విధంగా గ్రహణం పూర్తి అయిన తర్వాత మీ ఇంటిలోని పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. అలాగే ఇళ్లు మొత్తం గంగా జలం లేదా పసుపు నీళ్లు చల్లాలి. విగ్రహాలను కడిగి దీపం ముట్టించాలి.  దీని వలన ప్రతి కూల శక్తి పూర్తిగా తొలిగిపోతుంది.

3 / 5
అలాగే చాలా మంది గ్రహణానికి ముందు వంటలు వండుకొని ఉంటారు. అందువలన గ్రహణానికి ముందు వండిన అన్నం , కూరలు, పెరుగు, పాలు వంటివి అస్సలే పనికి రావు అంటారు. అందువలన వాటన్నింటి బయటపడవేయాలంట.

4 / 5
అదే విధంగా గ్రహణం తర్వాత దాన ధర్మాలు చేయడం చాలా మంచిదంట.  వీలైనంత వరకు గ్రహణం తర్వాత బియ్యం, నువ్వులు, బట్టలు , డబ్బు వీటిని దానం చేయడం వలన  వీరికి కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు.

5 / 5
Follow Us