
మిథునం: శుభ గ్రహాలైన బుధ, శుక్రులు ఈ రాశికి పంచమ స్థానంలో, అంటే దైవానుగ్రహ స్థానంలో కలిసి ఉన్నందు వల్ల ఈ రాశివారికి ఈ 20 రోజుల కాలంలో సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్టాకులు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా కూడా సంపద పెరుగుతుంది. అనుకోకుండా ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధ, శుక్రులు వక్రించి అనుకూలంగా మారుతున్నందువల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ప్రాభవం, వైభవం పెరుగుతుంది. సాధారణ ఆర్థిక స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశముంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవనశైలి మారిపోతుంది. భోగభాగ్యాలలో మునిగి తేలుతారు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది.

కన్య: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడు ధనాధిపతి శుక్రుడు యుతి చెందడం, పైగా వక్రించి బలపడడం వల్ల ఈ రాశివారికి నూరు శాతం మహాలక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం కలిసి వస్తుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం కావడం, ఆస్తి విలువ పెరగడం, ఆస్తి పాస్తులు కలిసి రావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగ సమస్యల నుంచి బయటపడతారు.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో హోదా పెరగడానికి, ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశముంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశముంటుంది. ఇతర దేశాల నుంచి కూడా నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వస్తుంది.

మకరం: ఈ రాశికి దశమ స్థానంలో భాగ్యాధిపతి బుధుడు, దశమాధిపతి శుక్రుడు కలవడం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా మహా భాగ్య యోగం పట్టే అవకాశముంది. సంపన్న వ్యక్తితో వివాహం కుద రడం గానీ, సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం గానీ జరుగుతుంది. జీవన శైలిలో మార్పు వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

కుంభం: ఈ రాశికి భాగ్య స్థానంలో బుధ, శుక్రులు వక్ర గతిలో యుతి చెందినందువల్ల ఏ ప్రయత్నం తల పెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. వారసత్వంగా ఆస్తులు కలిసి వచ్చే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగాల్లో జీతభత్యాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగుల కల నెరవేరుతుంది. కుటుంబంలో సంతాన ప్రాప్తి వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.