Marriage Astrology: ఉగాది తర్వాత.. ఆ రాశుల వారి ఇళ్లలో పెళ్లి బాజాలు..!

Edited By:

Updated on: Mar 09, 2026 | 3:16 PM

శుభ కార్యాలకు, పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం, గురువు అనకూల సంచారం చేస్తుండడం వల్ల వల్ల కొన్ని రాశుల వారి ఇళ్లలో ఉగాది తర్వాత నుంచి జూన్ లోగా పెళ్లి బాజాలు ఎక్కువగా మోగే అవకాశం ఉంది. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారి కుటుంబాల్లో శుభ కార్యాలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడం, గృహ, వాహన యోగాలు కలగడం, సంతాన యోగం పట్టడం, ఆశించిన ఉద్యోగం లభించడం వంటివి జరిగే అవకాశం ఉంది.

1 / 6
వృషభం: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలోనూ, లాభాధిపతి గురువు కుటుంబ స్థానంలోనూ సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారు తప్పకుండా పెళ్లి సంబంధమైన శుభవార్త వినే అవకాశం ఉంది. ఆశించిన బంధువుతోనో, ప్రేమించిన వ్యక్తితోనో పెళ్లి కుదిరే సూచనలున్నాయి. ఉగాది తర్వాత పెళ్లి ప్రయత్నాలు చేయడం, మాట్లాడుకోవడం వంటివి చేయడం మంచిది. ఈ రాశివారు గృహ ప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి కూడా అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.

2 / 6
కర్కాటకం: కళత్ర కారకుడైన శుక్రుడు ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండడంతో పాటు, రాశ్యధిపతి చంద్రుడు కూడా కొద్ది కాలం పాటు అనుకూలంగా ఉండడం వల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉగాది తర్వాత చేసే పెళ్లి ప్రయత్నాలు ఖాయంగా సానుకూల ఫలితాలనిస్తాయి.  ప్రేమ జీవితం సఫలమవుతుంది. కొద్ది ప్రయత్నంతో త్వరలో గృహ ప్రవేశానికి అవకాశం ఉంది. సంతాన యోగం కూడా పడుతుంది.

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి విదేశీ సంబంధం ఖాయమవుతుంది. దశమ స్థానంలో ఉన్న గురువు కారణంగా సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. శంకుస్థాపనకు లేదా గృహ ప్రవేశానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల ప్రేమ జీవితం పెళ్లి జీవితంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఉగాది తర్వాత కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి వివాహం తప్పకుండా నిశ్చయం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి సహచరులు లేదా పరిచయస్థులతో పెళ్లి కుదరడానికి కూడా అవకాశం ఉంది. గృహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి ఆస్తి కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తి సూచనలున్నాయి.

5 / 6
కుంభం: ఈ రాశికి కుటుంబ స్థానంలో కళత్రకారకుడు శుక్రుడు ఉచ్ఛ పట్టడం, ఈ రాశిని కుటుంబ స్థానాధిపతి గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారు ఉగాది తర్వాత ప్రేమలో పడడం గానీ, పెళ్లి చేసుకోవడం గానీ తప్పకుండా జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వైభవంగా, ఆడంబరంగా వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితం కూడా అనుకున్న విధంగా పెళ్లికి దారి తీస్తుంది. గృహ ప్రవేశానికి కూడా బాగా అవకాశం ఉంది.

6 / 6
మీనం: ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపట్టడం, చతుర్థ స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం జూన్ లోపు ఈ రాశివారికి పెళ్లి సంబంధం కుదరడంతో పాటు గృహ ప్రవేశం చేయడానికి కూడా అవకాశం ఉంది. ప్రేమ వివాహం కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. బాగా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. ఉగాది తర్వాత వీరికి ప్రేమ జీవితం మొదలయ్యే అవకాశాలున్నాయి. గురు బలం కారణంగా వీరి సొంత ఇంటి కల నెరవేరుతుంది. సంతాన యోగం కలుగుతుంది.

Follow Us