AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మటన్ కర్రీ వండేటప్పుడు ఇది ఒక్కటి వేస్తే చాలు.. ముక్క వెన్నలా కరిగిపోతుంది

ఆదివారం వచ్చిందంటే చాలు, చాలామంది ఇళ్లలో మటన్ కర్రీ ఘుమఘుమలు రావాల్సిందే. అయితే మటన్ వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా మసాలాలు వేసినా, కొన్నిసార్లు ముక్క సరిగ్గా ఉడకక రబ్బరులా సాగడం లేదా గ్రేవీ పలచగా నీళ్లలా అయిపోవడం జరుగుతుంటుంది. అలాంటి సమస్య లేకుండా, ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతూ, చిక్కటి గ్రేవీతో కర్రీ కమ్మగా రావాలంటే అందులో తాజా పెరుగు వేయడమే అసలైన రహస్యం.

Phani CH
|

Updated on: Nov 14, 2026 | 8:34 PM

Share
కావలసిన పదార్థాలు: మటన్ అరకేజీ, నూనె 4 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఉల్లిపాయ తరుగు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా, టమాటాలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, తాజా పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, అనాస పువ్వులు 2, యాలకు ఒకటి, నీళ్లు 1 గ్లాసు.

1 / 5
ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కుక్కర్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత మంచి సువాసన కోసం చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోతే కూరకు తియ్యదనం వస్తుంది కాబట్టి చక్కగా వేగనివ్వాలి. ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నగా కోసిన రెండు టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గేవరకు ఉడికించాలి.

2 / 5
టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి, నూనె పైకి తేలేంత వరకు సన్నని మంటపై వేయించాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి అడుగు పట్టకుండా కలిపి, ఇందులో రెండు టేబుల్ స్పూన్ల తాజా పెరుగు వేయాలి. పెరుగు వేయడం వల్ల మటన్ ముక్కలు ఎంతో మృదువుగా ఉడకడమే కాకుండా గ్రేవీకి మంచి చిక్కదనం, కమ్మని రుచి వస్తాయి.

3 / 5
ఆ తర్వాత శుభ్రంగా కడిగిన అరకేజీ మటన్ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. కుక్కర్‌కు విజిల్ పెట్టకుండా కేవలం మూత మాత్రమే ఉంచి, నూనె పైకి తేలేంత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి. అనంతరం రెండు అనాస పువ్వులు, ఒక యాలకు, ఒక గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ మూత, విజిల్ పెట్టి ఏడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.

4 / 5
ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే నోరూరించే మటన్ కర్రీ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ గ్రేవీ మరింత చిక్కగా కావాలనుకుంటే మూత తీసి మరికొద్దిసేపు ఉడికించుకోవచ్చు. వేడివేడి అన్నం, బగారా రైస్, బిర్యానీ లేదా ఇడ్లీలలోకి ఈ మటన్ కర్రీ అద్భుతంగా ఉంటుంది.

5 / 5
Follow Us