AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

వేసవి వేడీ మనుషులనే కాదు, మనం తినే ఆహార పదార్థాలను కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా ప్రోటీన్లకు నిలయమైన గుడ్ల విషయంలో ప్రతి ఒక్కరికీ ఒక సందేహం ఉంటుంది. గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచాలా? లేక బయట ఉంచాలా?. కొంతమంది ఫ్రిజ్‌లో పెడితే గుడ్ల రుచి మారుతుందని భావిస్తే, మరికొందరు బయట ఉంటే పాడవుతాయని భయపడతారు. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Apr 11, 2026 | 8:38 AM

Share
సాల్మొనెల్లా: గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు చెప్పడానికి అతి ముఖ్యమైన కారణం సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా.  ఈ బ్యాక్టీరియా సహజంగా పక్షులు, కోళ్ల జీర్ణవ్యవస్థలో ఉంటుంది. గుడ్డు పెట్టే సమయంలో ఇది పెంకుపైకి లేదా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. వేసవిలో బయట ఉష్ణోగ్రతలు 35-45 డిగ్రీల వరకు ఉంటాయి. ఈ వేడి వాతావరణం సాల్మొనెల్లా బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా సోకిన గుడ్లను సరిగ్గా ఉడికించకుండా తింటే తీవ్రమైన 'ఫుడ్ పాయిజనింగ్'కు దారితీస్తుంది. ఇది చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చు.

1 / 5
4 డిగ్రీల సెల్సియస్ ఫార్ములా: శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. సాల్మొనెల్లా బ్యాక్టీరియా 4 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద వృద్ధి చెందలేదు. అంటే రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన గుడ్లు ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా సురక్షితంగా ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల గుడ్డు లోపల ఉండే ఎయిర్ సెల్ పెరగకుండా ఉంటుంది. తద్వారా గుడ్డు వారాల పాటు తాజాగా ఉంటుంది.

2 / 5
డోర్ షెల్ఫ్స్ వాడటం: చాలామంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టినప్పటికీ కొన్ని తప్పులు చేస్తుంటారు.  సాధారణంగా ఫ్రిజ్ డోర్లకు గుడ్లు పెట్టుకునే ట్రేలు ఉంటాయి. కానీ, డోర్ మాటిమాటికీ తీయడం వల్ల అక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది. కాబట్టి గుడ్లను ఫ్రిజ్ లోపలి భాగంలో ఉంచడం ఉత్తమం.

3 / 5
కడిగి పెట్టడం: గుడ్లపై ఉన్న మురికిని చూసి చాలామంది వాటిని కడిగి ఫ్రిజ్‌లో పెడతారు. గుడ్డు పెంకుపై వేల సంఖ్యలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. వాటిపై క్యూటికల్ అనే రక్షణ పొర ఉంటుంది. కడగడం వల్ల ఆ పొర పోయి బ్యాక్టీరియా సులభంగా లోపలికి వెళ్తుంది. ఫ్రిజ్ నుంచి తీసిన గుడ్లను వెంటనే వండుకోవాలి. బయట ఎక్కువ సేపు ఉంచితే వాటిపై తేమ ఏర్పడి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది.

4 / 5
గమనించాల్సిన అంశాలు: ఎల్లప్పుడూ తాజా గుడ్లనే ఎంచుకోండి. గడువు ముగిసిన గుడ్లలో పోషకాలు తగ్గి, ఇన్ఫెక్షన్ల భయం పెరుగుతుంది. పెంకుపై చిన్న పగులు ఉన్నా ఆ గుడ్డును వాడకపోవడమే మంచిది.
గుడ్డు తాజాదనాన్ని తెలుసుకోవడానికి గ్లాసు నీటిలో వేయండి. అది అడుగున ఉంటే తాజాగా ఉన్నట్లు, నీటిపై తేలితే అది పాడైపోయినట్లు అర్థం.

గమనించాల్సిన అంశాలు: ఎల్లప్పుడూ తాజా గుడ్లనే ఎంచుకోండి. గడువు ముగిసిన గుడ్లలో పోషకాలు తగ్గి, ఇన్ఫెక్షన్ల భయం పెరుగుతుంది. పెంకుపై చిన్న పగులు ఉన్నా ఆ గుడ్డును వాడకపోవడమే మంచిది. గుడ్డు తాజాదనాన్ని తెలుసుకోవడానికి గ్లాసు నీటిలో వేయండి. అది అడుగున ఉంటే తాజాగా ఉన్నట్లు, నీటిపై తేలితే అది పాడైపోయినట్లు అర్థం.

5 / 5
Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ

MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం

గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న

ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!

ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..

గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..

ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !

వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన

బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే

ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో