Lion Dental Problem: సింహాలకు దంత సమస్య వస్తే ఏం చేస్తారు? ట్రీట్‌మెంట్ ఉందా?

| Edited By: KVD Varma

Jul 17, 2021 | 9:53 PM

Lion Dental Problem: మనుషులకు దంతాలు ఉన్నట్టే జంతువులకూ ఉంటాయి. ఇది తెలిసిన విషయమే. కానీ, మనుషుల్లో తలెత్తినట్టే జంతువుల్లోనూ దంత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిప్పి పళ్ళు. మరి మనమైతే ఆసుపత్రికి వెళతాం. కానీ సింహాలు...

1 / 5
ఇంగ్లాండ్ లోని కేస్సింగ్లాండ్ అనే చోట ఓ జూ ఉంది. ఆ జూలో ఉన్న ఒక సింహానికి దంతాలలో సమస్య వచ్చింది. ఆ సింహం ఏమీ తినలేకపోతోంది. దీంతో వైద్యులు పరీక్షలు చేసి సింహానికి దంతాలలో సమస్య ఉందని తేల్చారు.

2 / 5
సమస్య ఉందని తేల్చారు సరే, మరి ఏమి చేయాలి. అందుకోసం పార్కర్, పుటర్ అనే వైద్యులు ఆ సింహానికి రూట్ కెనాల్ చికిత్స చేయాలని నిర్ణయించారు. మనుషులకు ఇది చేయడం సర్వ సాధారణం. కానీ, సింహం లాంటి జంతువుకు చేయాలంటే చాలా కష్టం. పైగా సుదీర్ఘమైనది. పెద్ద రూట్ కేనాల్స్ శుభ్రం చేయాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెప్పారు.

3 / 5
సింహానికి రూట్ కెనాల్ మొదలు పెట్టారు. ఆ జూలో ఉన్న ఆరు సింహాలలో ఇదే పెద్దది. దీని పేరు మో. దీనికి మత్తు మందు ఎక్కడానికి కొన్ని గంటలు పట్టింది. మత్తు ఇంజక్షన్ ఇచ్చకా డానికి మత్తు వచ్చింది అని తెలియడానికి అరగంట వేచి చూశారు డాక్టర్లు.

4 / 5
సింహం దంతాలు ప్రతీదాని మూలంలోకి కిందికి రంధ్రం చేశారు. దానిని పరిశుభ్రం చేశారు. తరువాత దానిని ప్యాక్ చేశారు. ఈ సింహం దంతం మూలం 60 మిమీ (2.3in) పొడవు ఉందని డాక్టర్ పార్కర్ చెప్పారు.

5 / 5
ఆ సింహం కాళ్ళమీద ఉండి.. సుదీర్ఘమైన, తీవ్రమైన నొప్పి కలిగించే చికిత్సకు సహకరించింది. దీంతో దేగ్విజయంగా డానికి రూట్ కెనాల్ చికిత్సను పూర్తి చేశారు వైద్యులు