YSRCP: రాజకీయ కుంభమేళాను తలపించిన సీఎం జగన్ ‘సిద్దం’ సభ..

| Edited By: Shaik Madar Saheb

Mar 11, 2024 | 6:46 AM

ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయాలు రోజురోజుకు వేగంపుంజుకుంటోంది. రాజకీయ పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ సిద్దం పేరుతో కార్యకర్తలను యాక్టీవ్ చేసే పనిలో పడ్డారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సిద్దం పేరుతో భారీ బహిరంగసభలు నిర్వహించారు. అయితే తాజాగా బాపట్లలో సిద్ధం పేరుతో నాలుగవ భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ప్రజలకు రాజకీయ కుంభమేళాను తలదన్నేలా విచ్చేశారు.

1 / 6
ఆంధ్రప్రదేశ్‎లో రాజకీయాలు రోజురోజుకు వేగంపుంజుకుంటోంది. రాజకీయ పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ సిద్దం పేరుతో కార్యకర్తలను యాక్టీవ్ చేసే పనిలో పడ్డారు.

2 / 6
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సిద్దం పేరుతో భారీ బహిరంగసభలు నిర్వహించారు. అయితే తాజాగా బాపట్లలో సిద్ధం పేరుతో నాలుగవ భారీ బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ప్రజలకు రాజకీయ కుంభమేళాను తలదన్నేలా విచ్చేశారు.

3 / 6
దాదాపు 15 లక్షల మంది ఈ సభకు హాజరై ఉంటారని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్న వెంటనే జై జగన్ అనే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. వీరందరికీ అభివాదం చేస్తూ ర్యాంప్ మీద నడిచారు.

4 / 6
 వై నాట్ 175 అంటూ ముందుకు దూసుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ దీనికి ప్రతీకగా సభలో 175 అనే సంఖ్యను ప్రాంగణం మొత్తం ఏర్పాటు చేసింది. ర్యాప్ ను కూడా వై అనే ఆకారంలో రూపొందించారు. సీఎం ప్రసంగిస్తూ.. ఇది ధర్మ, అధర్మాల మధ్య జరిగే యుద్ధం అని అన్నారు.

5 / 6
చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిపోయిందన్నారు. టీడీపీకి సైకిల్ కు టైర్లు లేవు, ట్యూబ్ లు లేవు, తుప్పుపట్టిన సైకిల్‎ను తోయడానికి ఇతర పార్టీలు కావాలని ప్రతిపక్షాలను ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలను మహాభారతంలోని కురుక్షేత్ర యుద్దంతో పోల్చారు సీఎం జగన్.

6 / 6
అందులోని కీలక ఘట్టాలను ఉదాహరిస్తూ.. శకుని చేతిలోకి పాచికలకు.. బాబు ఇచ్చిన వాగ్దానాలకు తేడా లేదన్నారు. చంద్రబాబు తాజా మేనిఫెస్టో‎లోని వాగ్దానాలు చూస్తే పక్క రాష్ట్రాల్లోంచి కొన్ని హామీలు తీసుకొచ్చి కిచిడి చేశారని విమర్శించారు. తాను అర్జునుడినంటూ విజయం తమదే అని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, నాయకులకు ధైర్యాన్ని ఇచ్చారు.