
నోటి పూతలు వస్తే చాలా మంది ఏం తినలేరు ఇంకా తిందాం అన్నా కూడా ఆ మంటతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆ సమయంలో నీళ్లు కూడా ఇబ్బందిగా తాగలిసి ఉంటుంది. ఈ సమస్య మీకు పదే పదే వస్తే మీరు దీనిని చిన్న సమస్య లాగా చూడకండి. దీనిని మీ ఇంట్లోనే ఉండే వాటితోనే ఈజీగా తగ్గించుకోవచ్చు. అదేటంటే

ఈ నోటి పూతను ఇంటి చిట్కాలతో చిటికెలో మాయం చేయవచ్చు. నోటి పూత సమస్య వస్తే కొంచం ఇబ్బందిగా ఉంటుంది. ఇవి కొందరికి చిన్నప్పటి నుంచి వస్తాయి అయినా కూడా తగిన శ్రద్ద తీసుకోరు ఇవి పెరిగి పెరిగి పెద్దదిగా మారుతుంది. దీనిని మీరు మొదట్లోనే తగ్గించుకోవాలి అప్పుడే ఇది మళ్ళీ రాకుండా ఉంటుంది.

మనం నిత్యం వాడే పసుపుతో ఈ నోటి పూతలను తగ్గించుకోవచ్చు. ఇది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకా దీనిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లెమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు దీనిని తగ్గేలా చేస్తుంది అయితే, మీరు ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు వేసి కలిపి నోటిలో పుక్కిలిస్తూ ఉండాలి

ఇంకా మీరు రోజులో ఇలా రెండు నుంచి మూడు సార్లు చేస్తే కొంచం త్వరగా మీరు ఉపశమనం పొందొచ్చు. ఇంకా మీ ఆహారంలో కూడా ఇది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ చిట్కాను మీరు పాటిస్తే ఒక్క రోజులోనే అక్కడ చల్లబడి మీకు ఉపశమనం కలుగుతుంది. నోటి పూత ఉన్న చోట నెయ్యి రాస్తే చల్లగా అవుతుంది ఇలా రోజులో రెండు సార్లు రాస్తే తగ్గిపోతోంది.

హాస్పిటల్ కి వెళ్లి డబ్బులు వదిలించుకోవడం కన్నా ఇది పాటించడం మంచిది. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)