
మునగ ఆకు కూరకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు మునగ ఆకులు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు ఎండుమిర్చి , కొద్దిగా కరివేపాకులు తీసుకోవాలి.

మునగ ఆకు కూరకు తయారీ విధానం: ముందుగా ఆకులు ఇలా రెడీ చేసుకోవాలి. మునగ ఆకులను తీసుకుని నీటితో బాగా కడిగి కడిగి నీరు వాటిని వంపి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టుకోవాలి.

ఉల్లిపాయ, మునగ ఆకులను కలుపుకోవాలి: ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు , వెల్లుల్లి వేసి బంగారు కలర్లోకి మారే వరకు బాగా వేయించాలి. ఆ తరవాత మునగ ఆకులు వేసి వాటిని అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.

మీడియం మంట పై ఉడికించుకోవాలి: మీడియం మంట పై మూత పెట్టి 10 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించాలి. అవసరమైతే ప్లే గ్లాస్ నీరు బాగా కలుపుకోవాలి. ఈ ఆకులు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో తింటే, రుచి కరంగా ఉంటుంది. ఇంకా నెయ్యితో తింటే రుచి అదిరిపోతోంది.

ఇంకా ఈ కూరలో కొంచెం పెసర పప్పు కలిపితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలాగే, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి దీనిలో ఐరన్, కాల్షియం రిచ్ ఉంటుంది. అయితే, వీటిని ఎక్కువ ఉడికించకూడదు. అలా ఉడికిస్తే పోషకాలు మొత్తం తగ్గిపోతాయి. కంటిచూపు తగ్గిన వాళ్ళకి ఈ ఆకు కూర పర్ఫెక్ట్. తింటే, నెలల్లోనే కళ్ళజోడు వాడటం ఆపేస్తారు