
చాలామంది అన్నం మానేస్తే నీరసం వస్తుందని, శరీరం బలహీనపడుతుందని, భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు వస్తాయని భావిస్తుంటారు. ఇంట్లో పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల ఈ అనుమానాలు మరింత పెరిగాయి. ఈ అపోహలను తొలగించడానికి " మీరు అన్నం మానేయండి కానీ తిండి మానేయకండి"

అన్నం మానేయడం అంటే తినడం మానేయడం కాదు వీటిని తినాలి. ఆరోగ్య సమస్యలున్నవారు లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనుకునేవారు అన్నానికి బదులుగా ఇతర పోషక విలువలున్న ఆహారాలను తీసుకోవాలి. అవి గోధుమపిండి పుల్కాలు లేదా మల్టీగ్రెయిన్ పిండితో చేసిన పుల్కాలు జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, రాగి రొట్టెలు.

ఈ ధాన్యాలను అన్నం రూపంలో కాకుండా, పిండి రూపంలో రొట్టెలుగా లేదా పుల్కాలుగా తీసుకోవాలి. ఇక్కడ మనం కేవలం ఆహారపు రూపాన్ని మారుస్తున్నాం, ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టడం లేదు. అన్నం మానేయమని చెప్పడానికి ప్రధాన కారణాలు ఇవే.. కూరగాయలు ఎక్కువగా తినడం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వంటి నీడపట్టున కూర్చునే వారికి కర్రీస్ ఎక్కువగా తినడం అవసరం. అన్నంలో కర్రీస్ ఎక్కువగా తినలేము, కానీ పుల్కాల్లో కూరలు ఎక్కువగా తీసుకోవచ్చు.

అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. పుల్కాలు, రొట్టెల ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి. ఇది బరువు తగ్గడానికి, షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. అన్నం మానేసినంత మాత్రానా శక్తి తగ్గిపోకుండా, నీరసం రాకుండా ఉండాలంటే మొలకలు తప్పనిసరి. మొలకల నుంచి మంచి పోషకాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి అందుతాయి.

మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. శరీరానికి అందవలసిన పోషకాలు అందేలా చూసుకుంటూ, హానికరమైన వాటిని వదిలేయాలి. సరిగ్గా ప్రణాళిక చేసుకుని అన్నానికి బదులుగా ఈ ప్రత్యామ్నాయాలను తీసుకుంటే, కండరాలు క్షీణించడం గానీ, బలహీనపడటం గానీ జరగదు