పాల ఉప్మా ఎప్పుడైనా చేశారా? ఇలా చేస్తే ఇష్టం లేని వాళ్ళు కూడా గిన్నెల మీద గిన్నెలు లాగిస్తారు

Updated on: Nov 10, 2026 | 9:55 AM

ప్రతి రోజూ చేసే టిఫిన్ లో కొత్తదనం కోరుకునే వారికి పాల ఉప్మా ఒక అద్భుతమైన ఎంపిక. సాధారణంగా నీటితో చేసే ఉప్మాకు బదులుగా, పాలతో తయారు చేసే ఈ ఉప్మా చాలా రుచికరంగా, కమ్మగా ఉంటుంది. అంతేకాకుండా, కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు పాటిస్తే ఉప్మా అస్సలు ముద్ద అవ్వకుండా వస్తుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ – 1 కప్పు,  నూనె – 2 టేబుల్‌స్పూన్లు,  పల్లీలు – 2-3 టేబుల్‌స్పూన్లు, ఆవాలు – 1 టీస్పూన్,  పచ్చిశనగపప్పు – 1 టేబుల్‌స్పూన్,   మినపప్పు – 1 టేబుల్‌స్పూన్, అల్లం ముక్కలు (చిన్నగా తరిగినవి) – 1 టీస్పూన్ ,  పచ్చిమిర్చి – 4-5 (కారాన్ని బట్టి),  ఉల్లిపాయ (చిన్నగా తరిగినది),   జీడిపప్పు – కొన్ని, కరివేపాకు – 1 రెబ్బ,  నీళ్లు – 1 కప్పు, పాలు-  2 కప్పులు ,   ఉప్పు – రుచికి సరిపడా,  కొత్తిమీర – కొద్దిగా  తీసుకోవాలి.

2 / 5

ముందుగా, ఒక మందపాటి కడాయిని పొయ్యి మీద పెట్టి, అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేయాలి. రవ్వను చాలా తక్కువ మంటపై రెండు నుండి మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. రవ్వ రంగు మారకూడదు, కేవలం వేడి తగిలితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల ఉప్మా ఉడికిన తర్వాత కూడా పేస్ట్‌లా కాకుండా, పలుకులుగా వస్తుంది. వేయించిన రవ్వను ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి.

3 / 5
అదే కడాయిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసుకోవాలి. పాల ఉప్మాకు నూనెనే బాగా సరిపోతుంది, నెయ్యి అంతగా రుచి ఇవ్వదు. నూనె వేడెక్కిన తర్వాత, రెండు మూడు టేబుల్‌స్పూన్ల పల్లీలు వేసి కాసేపు వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టేబుల్‌స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టేబుల్‌స్పూన్ మినపప్పు వేసి, లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. పప్పులు మాడిపోకుండా చూసుకోవాలి.

4 / 5
పప్పులు వేగిన తర్వాత, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టీస్పూన్ అల్లం ముక్కలు, అలాగే నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు వేయించి, ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయను వేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఆఖరిగా, కావాలనుకుంటే కొన్ని జీడిపప్పులు,  ఒక రెబ్బ కరివేపాకు వేసి పోపును బాగా వేయించుకోవాలి.పోపు బాగా వేగిన తర్వాత, ఒక కప్పు నీళ్లు పోయాలి. ఆ తర్వాత, గది ఉష్ణోగ్రతలో ఉన్న రెండు కప్పుల పాలను కలపాలి. మొత్తం మీద ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్ళు అవసరం అవుతుంది. మీకు ఇష్టమైతే, మూడు కప్పులు పాలను మాత్రమే ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఇలా పాలు పోసిన తర్వాత, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో బాగా మరిగించాలి

5 / 5
పాలు రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు, పొయ్యిని లో ఫ్లేమ్‌లో పెట్టి, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను నెమ్మదిగా కలుపుతూ వేయాలి. ఇలా చేయడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. రవ్వ వేసిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. పాలతో ఉప్మా చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన చిట్కా ఏమిటంటే, పాలు మరిగేటప్పుడు ఉప్పును అస్సలు వేయకూడదు. అలా వేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. అందువల్ల, పాలు దగ్గరపడి, ఉప్మా ఉడుకుతున్నప్పుడు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన తర్వాత, మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉప్మా దగ్గరపడి, పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రక్రియకు దాదాపు పది నిమిషాలు పడుతుంది. ఆఖరిగా, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని దించి వేయాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us