Mental Health: స్ట్రెస్‌, యాంగ్జైటీతో బతుకు చిత్తు.. తేలిగ్గా బయటపడాలంటే టిప్స్ ఇవిగో..

|

Nov 06, 2024 | 1:02 PM

పగ్గాలు లేకుండా పరుగులు తీసే మనసుకు కళ్లెం వేయాలి. లేదంటే దానిని అదుపు చేయడం కష్టం. ఆలోచనలను అదుపు చేయకుంటే పెను భూతమై భయపెడుతుంది. నేటి యువత ఈ సమస్యతోనే సతమతమవుతుంది. ఇందుకు పరిష్కారం కావాలంటే రోజూ ఇలా చేసి చూడండి..

1 / 5
నేటి జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ ఒత్తిడి వగైరా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి, ప్రారంభ దశలోనే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే, మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

2 / 5
స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్ గురించి అవగాహన చాలా అవసరం. అయితే ఒత్తిడిని ఎదుర్కొంటున్న వ్యక్తిని గుర్తించడం ద్వారా వారి మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది.

3 / 5
ఒత్తిడిని ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. ముఖ్యంగా సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఓ షెడ్యూల్‌ను రూపొందించుకోవాలి.  ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా దీనిని తయారు చేసుకోవాలి.

4 / 5
శరీరం, మనస్సు ఒత్తిడి నుండి కోలుకోవడానికి వీలుగా రాత్రి సమయంలో కనీసం 7-9 గంటల నిద్ర చాలా అవసరం. ధ్యానం, లోతైన శ్వాస, యోగా మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

5 / 5
ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఆహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి. కెఫీన్, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. బదులుగా నీళ్లు, హెర్బల్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. అలాగే పండ్లు, కూరగాయలు, మాంసకృత్తులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.