AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసాలా జొన్న రొట్టె.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. ఉదయాన్నే రెండు తింటే చాలు

జొన్నపిండితో తయారుచేసే రొట్టెలు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత స్నాక్స్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తీసుకోవడానికి ఇది చక్కటి ఎంపిక. జొన్నపిండితో మసాలా రొట్టె ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Oct 15, 2026 | 7:02 PM

Share
ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి రెండు కప్పుల జొన్నపిండిని తీసుకోవాలి. ఇది ఇంట్లో తయారుచేసుకున్న పిండి అయినా, బయట కొన్నదైనా పర్వాలేదు. పిండి తీసుకున్న తర్వాత, రుచిని పెంచడానికి కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి, విడివిడిగా చేసి పిండిలో వేయాలి. అలాగే, సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అర టీస్పూన్ జీలకర్ర, గుప్పెడు వేయించిన పల్లీలను పగలగొట్టి వేసుకోవాలి. అదనపు రుచి, పోషకాల కోసం రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును కనీసం ఒక గంట పాటు నానబెట్టి వేసుకోవాలి.

1 / 5
ఇక మసాలా విషయానికి వస్తే, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరి. రుచికి సరిపడా ఉప్పు,  పావు టీస్పూన్ కారం,  కొంచెం పసుపును చేర్చాలి. చివరిగా, రెండు టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు కూడా వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. కావాలంటే నువ్వులు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉప్పు, కారం మొదట తక్కువ వేసి, అవసరమైతే తర్వాత కలుపుకోవచ్చు, ముందే ఎక్కువ వేయకుండా జాగ్రత్తపడాలి.

2 / 5
పిండిని కలపడానికి ముందు నీళ్లు పోయకుండా అన్ని పదార్థాలు బాగా కలిసేలా చూసుకోవాలి. తర్వాత, ఒక కప్పు వేడినీళ్లను కొద్దికొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. వేడినీళ్లు పోస్తున్నప్పుడు స్పూన్‌తో కలపడం ఉత్తమం. మొత్తం నీళ్లు ఒకేసారి పోయకుండా, పిండి స్వభావాన్ని బట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసుకోవాలి. కొత్త పిండికి తక్కువ నీళ్లు అవసరం కావచ్చు, పాత పిండి లేదా బయట కొన్న పిండికి కొంచెం ఎక్కువ నీళ్లు పట్టవచ్చు. నాకైతే ఒక కప్పు వేడినీళ్లు సరిపోయాయి. నీళ్లు పోసిన తర్వాత, పిండి కొంచెం చల్లబడిన తర్వాత చేత్తో ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి. చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, కొంచెం మృదువుగా, సులువుగా వత్తడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా కలిపిన పిండిని పది నిమిషాల పాటు నాననివ్వాలి.

3 / 5

రొట్టెను వత్తడానికి బట్టర్ పేపర్ లేదా తడి గుడ్డను ఉపయోగించవచ్చు. బట్టర్ పేపర్‌కు కొంచెం నూనె రాసి, తగినంత పిండిని తీసుకుని క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా చేతికి నూనె అద్దుకుంటూ వత్తుకోవాలి. అంచులు పగిలినట్లు అనిపిస్తే, చేత్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్టర్ పేపర్ లేనివారు శుభ్రమైన కాటన్ క్లాత్‌ను తడిపి, నీళ్లు లేకుండా పిండి, దానిపై రొట్టెను వత్తుకోవచ్చు.

4 / 5
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి, అర టీస్పూన్ నూనె వేసి విస్తరించాలి. వత్తుకున్న రొట్టెను జాగ్రత్తగా పెనం మీద వేసి, బట్టర్ పేపర్‌ను నిదానంగా తీసేయాలి. మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో రొట్టెను బాగా కాలే వరకు ఉంచాలి. ఒక వైపు కాలాక, కొంచెం నూనె రాసి, రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి. వేడినీళ్లతో కలిపినందువల్ల రొట్టె విరిగిపోకుండా, చక్కగా వస్తుంది.రెండు వైపులా కాలిన తర్వాత తీసేస్తే వేడివేడి, రుచికరమైన జొన్న రొట్టె సిద్ధం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి, పల్లీలు, నువ్వులు, పచ్చిశెనగపప్పు తగులుతూ మసాలా ఫ్లేవర్‌తో చాలా బాగుంటుంది. జొన్నపిండి ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఇది తింటే చాలా మంచిది.

5 / 5
Follow Us