చీరలో చందమామలా.. అతిలోక సుందరి గారాలపట్టీ అందానికి ఫిదా అవ్వాల్సిందే!
జాన్వీ కపూర్ తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసే బాలీవుడ్ నటి. తాజాగా, ఆమె చీరలో చక్కని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధడక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో కలిసి నటిస్తోంది. ఆమె అందం, నటన, సోషల్ మీడియా యాక్టివిటీ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ ఆర్టికల్ లో ఆమె తాజా ఫోటోలు, సినిమా కెరీర్ గురించి తెలుసుకోండి.
Updated on: Sep 24, 2025 | 2:11 PM

అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అమ్మడు తన అంద చందాలతో ఎంతో మంది మదిని దోచుకుంది. తాజాగా చీరలో తన అందంతో మరోసారి కట్టిపడేస్తుంది. మరి మీరు కూడా ఈ బ్యూటి లేటేస్ట్ క్యూట్ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ తన అంద, చందాలతో అందరిమనసు దోచేస్తుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ తన క్యూట్ నెస్‌తో అందరిని మాయ చేస్తుంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా రామ్ చరణ్ సరసన ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గనుక రిలీజ్ అయితే ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా చీరలో తన అందంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫొటోస్ చూసిన వారందరూ బ్యూటిఫుల్, క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



