వీరికి బీట్‌రూట్ విషంతో సమానం.. ఈ సమస్యలు ఉన్నవారు తాగితే ప్రాణాలకే రిస్క్..

Updated on: Mar 19, 2026 | 11:07 AM

బీట్‌రూట్.. పోషకాల గని. ఇందులో ఉండే ఫోలేట్, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. రక్తాన్ని పెంచడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి చాలా మంది బీట్‌రూట్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పోషకమైన జ్యూస్ అందరికీ సరిపడదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది ప్రయోజనానికి బదులుగా హాని కలిగించే అవకాశం ఉంది.

1 / 5

కిడ్నీలో రాళ్ల సమస్య : ఎవరికైతే కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదా గతంలో ఆ సమస్యతో బాధపడ్డారో, వారు బీట్‌రూట్ జ్యూస్ తాగకపోవడమే మంచిది. బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అనే మూలకం అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా, కొత్తగా రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

2 / 5
తక్కువ రక్తపోటు: బీట్‌రూట్ సహజంగానే రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది హై బీపీ ఉన్న రోగులకు వరప్రసాదం లాంటిది. కానీ, ఇప్పటికే లో బీపీతో బాధపడేవారు దీనిని తీసుకుంటే రక్తపోటు మరింత పడిపోయి, నీరసం లేదా కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

3 / 5

బలహీనమైన జీర్ణశక్తి: తరచుగా కడుపు నొప్పి, గ్యాస్ లేదా ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బీట్‌రూట్ రసానికి దూరంగా ఉండాలి. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల కొంతమందిలో జీర్ణక్రియ మందగించి, కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది.

4 / 5
అలర్జీ సమస్యలు: అలర్జీలు ఉన్నవారికి బీట్‌రూట్ రసం ఒక్కోసారి వికటించవచ్చు. దీనివల్ల చర్మంపై దురద, ఎర్రటి దద్దుర్లు లేదా చికాకు కలగవచ్చు. కొంతమందిలో వికారం లేదా వాంతులు వంటి దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు.

5 / 5
ఏదైనా అతిగా తీసుకుంటే అది హాని కలిగిస్తుందనేది మరువకూడదు. బీట్‌రూట్ జ్యూస్ మీ శరీరానికి సరిపడుతుందో లేదో తెలుసుకోవడానికి తక్కువ పరిమాణంలో ప్రారంభించడం లేదా మీ వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Follow Us