3 / 6
పేరు , గుర్తింపు గోప్యత: లైంగిక వేధింపులు లేదా అత్యాచారం వార్తల్లో బాధితురాలి పేరును ప్రచురించరాదు. బాధితురాలి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. రాజ్యాంగం కూడా మహిళలకు ఈ హక్కును కల్పించింది. లైంగిక వేధింపుల విషయంలో గోప్యత పాటించేందుకు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో తన వాంగ్మూలాన్ని నమోదు చేసే హక్కు మహిళకు ఉంటుంది. కావాలంటే ఆమె నేరుగా జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట కూడా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు, మీడియా లేదా ఏ అధికారికి కూడా బాధిత మహిళ పేరుని, గుర్తింపుని బహిర్గతం చేసే హక్కు లేదు.