AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమలకి ఈ మొక్కలంటే దడ.. ఇంట్లో ఉంటే మీ వైపు రావు..

వర్షాకాలంలో దోమలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి కారణం ఈ సీజన్‌లో గుంతల్లో నీరు నిల్వ ఉండడమే. అంతేకాదు మురికి నీరు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి పారుతూనే ఉంటుంది. ఈ కారణాల వలన ఈ సీజన్ లో దోమలు వృద్ధి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుంది. కనుక వర్షాకాలంలో దోమల వృద్ధి చెందకుండా.. మన చుట్టూ ఉండే వాతావరణాన్ని శుభ్రపరిచేందుకు కొన్ని మొక్కలను పెంచుకోవచ్చు. ఈ మొక్కలను బాల్కనీలో లేదా, గార్డెన్ లో పెంచుకోవడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా చాలా వరకు సహాయపడతాయి. ఈరోజు అటువంటి మొక్కల గురించి తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Aug 02, 2025 | 7:55 PM

Share
వేప: వేపను పురుగుమందుగా పరిగణిస్తారు. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోమలు, క్రిమికీటకాదులు తరిమి కొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగబెట్టేవారు. అంతేకాదు వేపనూనెను కూడా ఉపయోగిస్తారు. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే డోర్ లేదా బాల్కనీలో వేప మొక్కను నాటండి. ఇంట్లో స్థలం సమస్య ఉంటే. ఇప్పుడు బోన్సాయ్ వంటి వేప మొక్కలు లభిస్తున్నాయి.

1 / 5
నిమ్మగడ్డి: ఈ మొక్క ఇది దోమలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్మకం. ఈ నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ క్రీములు,  రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క డెంగ్యూని వ్యాప్తి చేసే దోమల నుండి రక్షించగలదని కూడా నమ్మకం. .

2 / 5
రోజ్మేరీ: ఈ మొక్క లు నర్సరీలో లభిస్తాయి. ఇంట్లో పెంచుకోవడం చాలా సులభం. ఈ మొక్కలో వచ్చే పువ్వుల వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు పారిపోతాయి.  ఈ పువ్వులు ఇంట్లో పురుగుమందుగా కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడానికి ముందుగా పువ్వులను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టాలి.. అప్పుడు ఆ నీటిని పురుగులు రాకుండా చల్లాల్సి ఉంటుంది.

3 / 5
తులసి: ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన గింజలను చల్లినట్లయితే ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమేణా తులసి వనం ఏర్పడుతుంది.ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.

4 / 5
క్యాట్నిప్: పుదీనా ఆకులను పోలి ఉండే ఈ మొక్క ఎండలోనూ, నీడలోనూ బాగా పెరుగుతుంది. ఇది పురుగుమందు కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఈ మొక్కను ఇంటి ప్రాంగణంలో, బాల్కనీలో అలాగే ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్క దోమల నుండి మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?

ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..

ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..

షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?

వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?

సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!

మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే

తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..

ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా

పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం