Anemia: ఎనీమియాతో బాధ పడుతున్నారా.. ఇకపై నో టెన్షన్!

|

Nov 12, 2024 | 12:32 PM

ఈ మధ్య కాలంలో పోషకాలు లేని ఆహారం తినడం వల్ల ఎనీమియా సమస్యతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. ఇలాంటి వారు ఇప్పుడు చెప్పే ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు..

1 / 5
ఇటీవల కాలంలో ఆహారపు అలవాట్లలో, లైఫ్ స్టైల్‌లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ కారణంగానే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా ఎటాక్ చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది రక్త  హీనత సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. రక్తంలో ఐరన్ లోపంర కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. దీనినే ఎనీమియా అని కూడా అంటున్నారు.

2 / 5
రక్త హీనత సమస్య ఎక్కువైతే ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇప్పటికే రక్త హీనత సమస్యను కంట్రోల్ చేసే ఎన్నో ఆహారాల గురించి తెలుసుకున్నాం. రక్త హీనత సమస్యను అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు.

3 / 5
మనకు ఎక్కువగా, చాలా సులువుగా లభించే వాటిల్లో బెల్లం, నువ్వులు ఒకటి. ఈ రెండింటిలో కూడా మనకు ఐరన్ శాతం ఎక్కువగా లభిస్తుంది. వీటిని కాంబినేషన్‌గా లేదంటే విడిగా తీసుకున్నా కూడా రక్త హీనత సమస్య నుంచి చాలా త్వరగా బయట పడొచ్చు.

4 / 5
అదే విధంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాల్లో కూడా మనకు ఐరన్ లభిస్తుంది. కమలా పండ్లు, ఆరెంజెస్, బత్తాకాయలు, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లలో కూడా మనకు విటమిన్ సి, ఐరన్ పోషకాలు లభిస్తాయి.

5 / 5
బీట్ రూట్, రాజ్మా, ఆకు కూరల్లో కూడా మనకు ఐరన్ చక్కగా లభిస్తుంది. ఐరన్ లభించే పదార్థాలు మనకు చాలానే ఉంటాయి. కాబట్టి వీటిని తింటే.. ఎనీమియా సమస్య నుంచి బయట పడొచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

బీట్ రూట్, రాజ్మా, ఆకు కూరల్లో కూడా మనకు ఐరన్ చక్కగా లభిస్తుంది. ఐరన్ లభించే పదార్థాలు మనకు చాలానే ఉంటాయి. కాబట్టి వీటిని తింటే.. ఎనీమియా సమస్య నుంచి బయట పడొచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)