కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!

Updated on: Feb 13, 2026 | 9:54 PM

మనం ఇంట్లో కుక్ చేసే సాంబార్ రైస్ కు,ఇతర రాష్ట్రాల్లో చేసే సాంబార్ రైస్ కు రుచి చాలా వేరు ఉంటుంది. ఎందుకంటే, సాంబార్ లో వేసే మసాలాలు, కూరగాయలు ఇలా అన్ని ప్రాంతాన్ని బట్టి వాటి టేస్ట్ వేరుగా ఉంటుంది. అందుకే, మనకీ బయట ఉన్న టేస్ట్ ఇంట్లో ఉండదు. అయితే, ఎప్పుడు మనవే కాకుండా ఈ సారి కేరళ స్టైల్ సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్ధాలు: రెండు కప్పులు బియ్యం, అర కప్పు కందిపప్పు, నీళ్లు, బంగాళాదుంప, పచ్చిమిర్చి, మునక్కాయ, వంకాయ,  టమాటాలు, దోసకాయలు, బెండకాయ, మునక్కాయ, ఉల్లిపాయల, చింతపండు రసం, 2 టేబుల్ స్పూన్స్ సాంబార్ పొడి, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ నూనె, తాలింపు గింజలు, రుచికి సరిపడినంత ఉప్పు.

2 / 5
ముందుగా బియ్యన్ని కడిగి శుభ్రం చేసుకుని, అలాగే  కందిపప్పును కూడా కడిగి దానిలో 3 కప్పులు మంచి నీళ్లు పోసి కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.

3 / 5
ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక తాలింపు గింజలు,  ఉల్లిపాయలు, టమాటాలు, మీరు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్ని వేసి బాగా మగ్గించాలి.

4 / 5
ఇక ఇప్పుడు దీనిలో పసుపును, నెయ్యి వేసి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని వేసి, రుచికి సరిపడినంత ఉప్పును వేసి ఈ మిశ్రమంలో  దానిలో చింతపండు రసాన్ని పోసి కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వరకు పొయ్యి మీదే ఉంచండి

5 / 5
కూరగాయలు ముక్కలన్ని ఉడకడానికి కొంచం సమయం పడుతుంది కాబట్టి 10 నిముషాల పాటు అలాగే, స్టవ్ మీద ఉంచండి. ఉడికిన తర్వాత  పప్పు, అన్నాన్ని వేసి గరిటేతో బాగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి సాంబార్ రైస్ రెడీ.