AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈడొచ్చిన అమ్మాయిలు తప్పక తినాల్సిన కొబ్బరి రవ్వ లడ్డులు.. ఇలా చేస్తే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్

Kobbari rava laddu recipe in telugu: కొబ్బరి రవ్వ లడ్డులను ఎంతో మంది ఇష్టంగా ఉంటారు దీనిలో చక్కెర కొంచం ఎక్కువ వేస్తే ఇంకా స్వీట్ గా ఉంటాయి. సరైన కొలతలతో దీనిని చేసి తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ వీటిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 28, 2026 | 2:33 PM

Share
కొబ్బరి రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార లేదా బెల్లం తురుము, మూడు  టేబుల్ స్పూన్లు నెయ్యి,  ఒక కప్పు పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  10
జీడిపప్పు, 10 కిస్మిస్,  రెండు టేబుల్ స్పూన్లు  నూనెను తీసుకోవాలి.

కొబ్బరి రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుము, ఒక కప్పు పంచదార లేదా బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పు పాలు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 జీడిపప్పు, 10 కిస్మిస్, రెండు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి.

1 / 5
కొబ్బరి రవ్వ లడ్డు తయారీ విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్  బాగా వేయించుకోవాలి.  గ్యాస్ వెలిగించి  దాని  మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా వేడి చెయ్యాలి అది బాగా వేడయ్యాక వేయాలి. ఆ తర్వాత దీనిలో జీడిపప్పు, కిస్మిస్ లు కూడా వేసి బాగా వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వను కూడా సిద్ధం చేసుకోవాలి.

2 / 5
రవ్వను ఇలా వేయించుకోవాలి : మళ్ళీ అదే పాన్ తీసుకుని మరో స్పూన్ నెయ్యి వేసి దీనిలో బొంబాయి రవ్వను బాగా వేయించి , మంచి సువాసన వచ్చే వరకు సన్నని మంటపై దీనిని బాగా వేయించుకుని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఇప్పుడు కొబ్బరిని ఇలా వేయించుకోవాలి. పచ్చి లేదా ఎండు కొబ్బరిని తీసుకుని మంచిగా శుభ్రపరచుకోవాలి.

3 / 5
ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా కొబ్బరి తురుమును కూడా  వాసన పోయే  వరకు కనీసం 10 నిమిషాలు వరకు బాగా వేయించుకోవాలి. ఇక ఆ తర్వాత పాకం మిశ్రమం కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక వేయించిన కొబ్బరిలో పంచదార  వేసి వీటిని బాగా కలపాలి. అలాగే పంచదార కరిగిన తర్వాత, వేయించి పెట్టుకున్న రవ్వ, యాలకుల పొడి వేసి దీనిలో కలపాలి.

4 / 5
ఇక చివర్లో లడ్డులు ఇలా చుట్టాలి: దీనిలో  పాలు కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి, దానిలో ముందుగా  వేయించి పెట్టుకున్న  డ్రై ఫ్రూట్స్ కలుపుకోవాలి. ఇది  కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి  లేదా నూనె రాసుకుంటూ వీటిని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవడమే. అంతే కొబ్బరి రవ్వ లడ్డులు రెడీ.

5 / 5
Follow Us