AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఎండలు మండిపోతున్న ఈ కాలంలో ఫ్రిజ్‌లకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. నీళ్లు చల్లగా ఉండాలన్నా, వండిన ఆహార పదార్థాలు, కూరగాయలు తాజాగా ఉండాలన్నా ఫ్రిజ్ నిరంతరం నడవాల్సిందే. ఇందుకోసం మనం రోజులో ఎన్నో సార్లు ఫ్రిజ్ తలుపులు తెరుస్తూ, మూస్తూ ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. అయితే తరచుగా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇవి త్వరగా పాడైపోతుంటాయి. వాస్తవానికి రిఫ్రిజిరేటర్ పాడైపోయే ముందు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది..? అవేంటో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: May 24, 2026 | 5:44 PM

Share
సాధారణంగా రిఫ్రిజిరేటర్లు నడుస్తున్నప్పుడు ఒక చిన్న సౌండ్ చేస్తాయి. అలా కాకుండా మీ ఫ్రిజ్ నుండి అసాధారణమైన సౌండ్ వస్తే లోపల ఏదో సాంకేతిక సమస్య ఉందని అర్థం. అలాగే ఫ్రిజ్‌లో కూలింగ్ స్థిరంగా లేకపోవడం మరొక ముఖ్య సంకేతం. సడెన్‌గా విద్యుత్ బిల్లు విపరీతంగా పెరగడం కూడా ఫ్రిజ్ లోపల సమస్య ఉందనడానికి బలమైన సంకేతం. కంప్రెసర్ లోపం, డోర్ సీల్ విరిగిపోవడం, థర్మోస్టాట్ దెబ్బతినడం లేదా కండెన్సర్ కాయిల్స్ మురికిగా మారడం వల్లనే ఫ్రిజ్‌లు ఎక్కువగా పాడవుతుంటాయి.

1 / 5
లోపలి భాగాన్ని శుభ్రం చేయండి: మీ ఫ్రిజ్‌ను ప్రతి వారం క్లీన్ చేయడం చాలా అవసరం. చాలామంది ఫ్రిజ్‌ను అరుదుగా శుభ్రం చేస్తుంటారు. దీనివల్ల కూరగాయల గ్రేవీలు, సాస్‌లు, చిన్న చిన్న ఆహార కణాలు డోర్ గాస్కెట్‌పై పేరుకుపోతాయి. ఫలితంగా డోర్ సరిగ్గా లాక్ అవ్వక లోపలి చల్లటి గాలి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల ఫ్రిజ్‌ను చల్లబరచడానికి కంప్రెసర్ మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. చివరికి ఇది కంప్రెసర్ పాడైపోవడానికి, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడానికి దారితీస్తుంది.

2 / 5
కండెన్సర్ కాయిల్స్ - ఫిల్టర్ల నిర్వహణ: ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌ను సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు తప్పకుండా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల వాటిపై మురికి, ధూళి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ మురికి గాలి ప్రవాహానికి ఆటంకం కలిగించి, యంత్రం పనితీరును దెబ్బతీస్తుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉండే అన్ని ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, అవసరమైతే మార్చడం కూడా చాలా అవసరం.

3 / 5
అధిక భారం వేయవద్దు : చాలామంది ఫ్రిజ్ నిండా వస్తువులను కుక్కేస్తుంటారు. అలా ఫ్రిజ్‌ను పూర్తిగా నింపేయడం అస్సలు మంచిది కాదు. అధికంగా లోడ్ చేయడం వల్ల లోపల చల్లటి గాలి ప్రసరణ ఆగిపోయి, కంప్రెసర్‌పై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఫ్రిజ్ జీవితకాలాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

4 / 5
సరైన స్థలాన్ని ఎంచుకోండి: మీరు మీ రిఫ్రిజిరేటర్‌ను ఇంట్లో ఎక్కడ ఉంచుతారనేది కూడా చాలా ముఖ్యం. నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాలలో ఫ్రిజ్‌ను పెట్టకూడదు. అలాగే రిఫ్రిజిరేటర్ చుట్టూ గాలి ధారాళంగా ప్రసరించడానికి తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి. ఫ్రిజ్ పైభాగంలో వస్తువులను పెట్టకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల దాని పనితీరు బాగుంటుంది.

5 / 5
Follow Us
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి

వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..

స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్

సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!

తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం

భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్

ఖమ్మంలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం

ఫేస్‌బుక్‌లో చాటింగ్.. అడిగినంత డబ్బు ఇచ్చాడు.. తీరా కలవడానికి

మీ ఇంట్లో ఈ పిరమిడ్ పెట్టి చూడండి.. జాక్ పాట్ కొట్టినట్టే!