
గాలి ప్రసరణకు ప్రాధాన్యత: ఫ్రిజ్ లోపల వస్తువులను అతిగా కుక్కి పెట్టకండి. గాలి ఫ్రీగా తిరిగితేనే వస్తువులు తాజాగా ఉంటాయి. ముఖ్యంగా గాలి వచ్చే వెంట్స్ దగ్గర అడ్డుగా ఏమీ లేకుండా చూసుకోండి. అలాగే ఫ్రిజ్‌ను గోడకు ఆనించి ఉంచకుండా కనీసం 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోండి. దీనివల్ల కంప్రెసర్ నుండి వచ్చే వేడి సులభంగా బయటకు పోతుంది.

డీఫ్రాస్ట్ చేయడం మర్చిపోవద్దు: డైరెక్ట్ కూల్ ఫ్రిజ్ వాడుతున్నట్లయితే, ఫ్రీజర్‌లో మంచు ఎక్కువగా పేరుకుపోకుండా చూసుకోండి. అర అంగుళం కంటే ఎక్కువ మంచు పేరుకుంటే ఫ్రిజ్ సామర్థ్యం తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

సెట్టింగ్స్‌లో మార్పులు: వేసవి కాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రతను మాక్స్ కూలింగ్ మోడ్‌లో ఉంచడం అవసరం. డయల్ ఫ్రిజ్‌లు ఉన్నవారు కూలింగ్ లెవల్‌ను పెంచుకోవాలి. దీనివల్ల బాక్టీరియా చేరకుండా ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

డోర్ సీల్స్ - కాయిల్స్ తనిఖీ: ఫ్రిజ్ డోర్ సరిగ్గా పడుతుందో లేదో గమనించండి. డోర్ రబ్బర్ వదులైతే లోపలి చల్లదనం బయటకు పోయి, కంప్రెసర్ నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌ను ఆరు నెలలకోసారి శుభ్రం చేయడం వల్ల మిషన్ చల్లగా ఉంటుంది.

వేడి వస్తువులను దూరం: వండిన వెంటనే వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. అది గది ఉష్ణోగ్రతకు వచ్చాకే లోపల పెట్టండి. వేడి వస్తువులను లోపల పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత పెరిగి, దానిని తగ్గించడానికి కంప్రెసర్ మీద ఎక్కువ భారం పడుతుంది. వేసవి వచ్చే ముందే ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల గ్యాస్ లీకేజీలు ఉన్నా లేదా ఇతర సమస్యలు ఉన్నా ముందుగానే పరిష్కరించుకోవచ్చు.