Tech Tips: అబ్బా ఈ చిన్న ట్రిక్ ఎలా మిస్సయ్యాం.. ఫోన్‌ ఛార్జింగ్ స్పీడ్‌ పెంచడం ఇంత ఈజీనా !

Updated on: Aug 23, 2026 | 3:08 PM

ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది.ఫోన్ లేకుండా జనాలు ఒక్క నిమిషం కూడా ఉండలేరు. అయితే ఫోన్ ఎక్కవగా వాడడం కారణంగా ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. దాన్ని మళ్లీ ఛార్జ్ చేసేందుకు జనాలు ప్రస్తుతం ఫాస్ట్‌ ఛార్జర్లను ఉపయోగిస్తున్నారు. అయినా కూడా కొన్ని సార్లు ఛార్జింగ్ స్పీడ్‌గా ఎక్కదు. ఫోన్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కానీ మీరు కొన్ని ట్రిక్స్ పాటించి ఛార్జింగ్ స్పీడ్‌ను ఈజీగా పెంచవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఏరోప్లేన్ మోడ్ ఆన్: మీ దగ్గ ఫాస్ట్ ఛార్జర్ ఉన్న కూడా మీ ఫోన్ స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంటే.. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫ్లైట్ మోడ్‌ను ఆన్‌లో ఉంచండి. ఇలా చేయడం ద్వారా ఫోన్ నెట్‌వర్క్‌తో పాటు ఇంటర్నెట్, జిపిఎస్ (GPS), ఇతర సేవలు అన్ని నిలిచిపోతాయి. అలాంటి సమయంలో మీ ఫోన్ బ్యాగ్రౌండ్‌లో ఎలాంటి పనులు జరగవుకాబట్టి.. ఫోన్ ఛార్జింగ్ త్వరగా అవుతుంది.

2 / 5
సరైన ఛార్జర్: మన ఫోన్ ఛార్జింగ్ స్పీడ్‌గా ఎక్కాలంటే నాణ్యమైన, ఫోన్‌ కంపెనీకి చెందిన ఛార్జర్, కేబుల్‌ను మాత్రమే వాడాలి. కొన్ని సార్లు ఫోన్‌తో వచ్చిన ఛార్జర్ పోతే చాలా మంది మార్కెట్‌లో దొరికే ఫేక్ ఛార్జర్లను కొనుగోలు చేస్తూ ఉంటారు.ఇలా చేయడం వల్ల అవి పేలే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ ఛార్జ్ అవ్వడానికి కూడా చాలా సమయం పడుతుంది. కాబట్టి కంపెనీ సర్టిఫైడ్ చేసిన ఫాస్ట్ ఛార్జర్‌ను మాత్రమే వాడండి.

3 / 5
ఛార్జ్ చేసేప్పుడు ఫోన్ వాడోద్దు: చాలా మంది  ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి వాడుతుంటారు. కానీ ఇలా ఛార్జ్ చేసేటప్పుడు మొబైల్ వాడడం వల్ల బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది.దీని వల్ల ఫోన్‌ కూడా స్పీడ్‌గా ఛార్జ్ అవ్వదు. కాబట్టి ఛార్జ్ పెట్టే సమయంలో ఫోన్ ఉపయోగించకండి. అలాగే మొబైల్ నెట్‌వర్క్, బ్లూటూత్, ఇతర వైర్‌లెస్ కనెక్షన్‌లను ఆఫ్ చేయండి. దీనివల్ల బ్యాటరీ వాడకం తగ్గి, ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది.

4 / 5
ఛార్జింగ్ అప్లికేషన్‌లను యూజ్ చేయకండి: కొంతమంది ఫోన్‌ని వేగంగా ఛార్జ్ చేయడానికి కొన్ని ఛార్జింగ్ యాప్‌లను ఉపయోగిస్తారు, కానీ అటువంటి యాప్‌లు మీ ఫోన్ ఛార్జింగ్‌ని మరింత నెమ్మదిస్తాయి. అలాగే ఛార్జ్ చేసేటప్పుడు వాట్సాప్, యూట్యూబ్ వంటి ఏ ఇతర అప్లికేషన్‌లను బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వకుండా చూసుకోండి. ఇవన్నీ మొబైల్ వేగంగా ఛార్జ్ అవ్వకుండా ఆపుతాయి.

5 / 5
 మొబైల్ ఎక్కువగా వేడెక్కకుండా చూసుకోండి: మీరు మీ ఫోన్‌ని ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత వద్దే ఛార్జ్ చేయాలి. ఫోన్ ఎండ తగిలే ప్రాంతాల్లో ఛార్జింగ్ పెట్టడం వల్ల అది వేడెక్కి ఫోన్ బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. ఆ సమయంలో ఛార్జింగ్ స్పీడ్‌ తగ్గుతుంది. అంతేకాదు కొన్ని సార్లు అదిపేలిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పైన పేర్కొన్ని సింపుల్‌ చిట్కాలను పాటించడం ద్వారా మీ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్‌ను పెంచుకోవడంతో పాటు సేఫ్‌గా ఉంచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us