ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా..? మార్చకపోతే ఈ సమస్యలు గ్యారెంటీ!

Updated on: Mar 25, 2026 | 6:52 PM

మనం ఆరోగ్యంగా ఉండటానికి మంచి నిద్ర ఎంత ముఖ్యమో, ఆ నిద్రకు మనం వాడే దిండు కూడా అంతే ముఖ్యం. చాలామంది దిండు కవర్లను మారుస్తారు కానీ, దిండును మాత్రం ఏళ్ల తరబడి వాడుతూనే ఉంటారు. నిజమే కాదా..చాలామంది ఒకే దిండును సంవత్సరాల తరబడి వాడుతూనే ఉంటారు. కానీ, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత దిండును వాడటం వల్ల కలిగే నష్టాలు, అది ఎప్పుడు మార్చాలో తప్పక తెలుసుకోండి.

1 / 6
పాత దిండ్లలో కంటికి కనిపించని దుమ్ము పురుగులు (Dust Mites), బ్యాక్టీరియా, మృత చర్మ కణాలు పేరుకుపోతాయి. ఇవి ఉబ్బసం (Asthma), అలర్జీలు, చర్మ వ్యాధులకు కారణమవుతాయి. అంతేకాకుండా, కాలక్రమేణా దిండు తన ఆకృతిని కోల్పోవడం వల్ల మెడ, వెన్నెముకకు సరైన మద్దతు లభించదు. దీనివల్ల మెడ నొప్పి, భుజాల నొప్పులు మరియు తీవ్రమైన తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

2 / 6
అలర్జీలు, బ్యాక్టీరియా: మనం నిద్రపోయేటప్పుడు మన చర్మం నుండి రాలిన మృత కణాలు, చెమట, నూనెలు దిండులోకి చేరుతాయి. ఏళ్ల తరబడి ఒకే దిండును వాడటం వల్ల అందులో డస్ట్ మైట్స్ (దుమ్ము పురుగులు) చేరి అలర్జీలు, తుమ్ములు, శ్వాసకోశ సమస్యలను కలిగిస్తాయి.

3 / 6
చర్మ సమస్యలు: దిండులో పేరుకుపోయిన బ్యాక్టీరియా ముఖ చర్మానికి తగిలినప్పుడు మొటిమలు (Acne), దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఎన్ని క్రీములు వాడినా మొటిమలు తగ్గడం లేదంటే, సమస్య మీ పాత దిండులో ఉండవచ్చు.

4 / 6
మెడ, వెన్నునొప్పి: దిండు పనితీరు దాని ఆకృతిపై ఆధారపడి ఉంటుంది. పాతబడినా కొద్దీ దిండు మెత్తబడిపోవడం లేదా గడ్డలుగా మారడం జరుగుతుంది. దీనివల్ల నిద్రలో మెడకు సరైన సపోర్ట్ లభించక మెడ నొప్పి, వెన్నునొప్పి, భుజాల నొప్పులు మొదలవుతాయి.

5 / 6
నిద్రలేమి (Insomnia): అసౌకర్యంగా ఉండే దిండు వల్ల నిద్ర మధ్యలో మెలకువ రావడం, సరైన పొజిషన్ దొరక్కపోవడం వంటివి జరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో నిద్రలేమికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది.

6 / 6
దిండును ఎప్పుడు మార్చాలి?: సాధారణంగా ప్రతి 18 నెలల నుండి 2 ఏళ్లకు ఒకసారి దిండును మార్చడం మంచిది. మీ దిండును మధ్యలోకి మడిచినప్పుడు అది మళ్ళీ తన పాత స్థితికి రాకపోతే, అది పాడైపోయిందని అర్థం. దిండుపై పసుపు రంగు మచ్చలు ఏర్పడినా లేదా వాసన వస్తున్నా వెంటనే మార్చేయాలి. మీ దిండును ప్రతి 3 నెలలకు ఒకసారి ఎండలో ఉంచడం లేదా వాష్ చేయడం వల్ల బ్యాక్టీరియాను కొంతవరకు అరికట్టవచ్చు. మీ నిద్రను, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ దిండును మార్చే సమయం వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకోండి!

Follow Us