Gold: భూమి లోపల ఇంకా ఎంత బంగారం ఉంది.. ఇప్పటివరకు ఎంత తవ్వామో తెలుసా..?

Updated on: Feb 10, 2026 | 6:30 PM

బంగారం.. ఈ పేరు వింటేనే భారతీయుల కళ్లు మెరుస్తాయి. సంపదకు, హోదాకు చిహ్నంగా నిలిచిన ఈ పసుపు లోహానికి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. ధర ఆకాశాన్ని తాకుతున్నా కొనేవారు మాత్రం తగ్గడం లేదు. అయితే భూమి గర్భంలో ఉన్న ఈ సహజ వనరు ఎప్పటికీ అందుబాటులో ఉంటుందా? అసలు ఇప్పటి వరకు మనం ఎంత బంగారాన్ని తవ్వితీశాం? ఇంకా ఎంత మిగిలి ఉంది? అనే ప్రశ్నలకు US జియోలాజికల్ సర్వే నివేదికలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

1 / 5
మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 2,06,000 టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీశారు. ఈ మొత్తం బంగారం.. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాల నిల్వల కంటే కూడా ఎక్కువ. మన దగ్గర ఉన్న బంగారంలో సింహభాగం అంటే 45 శాతం ఆభరణాల రూపంలోనే ఉండటం విశేషం. మిగిలిన దాంట్లో 22 శాతం గోల్డ్ బార్లు, కాయిన్ల రూపంలో ఉండగా, కేవలం 17 శాతం మాత్రమే వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వ ఉంది.

2 / 5
భూమి గర్భంలో బంగారం నిల్వలు వేగంగా తరిగిపోతున్నాయని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. రిపోర్ట్ ప్రకారం.. భూమి లోపల ఇంకా కేవలం 70,550 టన్నుల బంగారం మాత్రమే మిగిలి ఉంది. అంటే మనం ఇప్పటికే సింహభాగం బంగారాన్ని వాడేసుకున్నాం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా దేశాల భూభాగంలోనే భారీ నిల్వలు ఉన్నాయి. బంగారం ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, నిల్వల విషయంలో మాత్రం అమెరికా టాప్‌లో ఉంది.

3 / 5
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేది సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్స్.. అమెరికా వద్ద 8,133.5 టన్నులు, జర్మనీ 3,351.6 టన్నులు, ఇటలీ 2,451.9 టన్నులు, ఫ్రాన్స్ 2,437 టన్నులు
రష్యా వద్ద 2,332.7 టన్నుల బంగారం ఉంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేది సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న గోల్డ్ రిజర్వ్స్.. అమెరికా వద్ద 8,133.5 టన్నులు, జర్మనీ 3,351.6 టన్నులు, ఇటలీ 2,451.9 టన్నులు, ఫ్రాన్స్ 2,437 టన్నులు రష్యా వద్ద 2,332.7 టన్నుల బంగారం ఉంది.

4 / 5
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భూమి లోపల ఉన్న నిల్వల కంటే ఎక్కువగా సముద్రాల అడుగున బంగారం ఉందని అంచనా. అయితే సముద్రపు నీటి నుంచి లేదా అడుగున ఉన్న గనుల నుండి బంగారాన్ని వేరు చేయడం అత్యంత ఖరీదైన, కష్టమైన పని కావడంతో అది అలాగే ఉండిపోయింది.

5 / 5
భూమిపై తవ్వగలిగే బంగారం పరిమితంగానే ఉంది. అందుకే భవిష్యత్తులో ఈ లోహానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బంగారాన్ని కేవలం అలంకరణ కోసమే కాకుండా ఒక సురక్షితమైన పెట్టుబడిగా ప్రపంచవ్యాప్తంగా జనం ఎంచుకుంటున్నారు.