మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు, అలవాట్ల వల్ల నేడు చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇలాంటప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి వైద్యుల సలహా మేరకు ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాలి.. అయినప్పటికీ, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మన ఆహారాలు, పానీయాల గ్లైసెమిక్ సూచిక చాలా ముఖ్యం.. దీని ప్రకారం ఆహారం లేదా పానీయాలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. దీనికి మంచి ఉదాహరణ.. మునగకాయ.. దీనిలో ఎన్నో ఔషధగుణాలున్నాయి.. ఇది యాంటీవైరల్, పొటాషియం, జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, జింక్ వంటి వివిధ పోషకాలను కలిగి ఉంటుంది.