ప్రకృతి నేర్పిన పాఠం.. తేనె తుట్టె ఆకారంలో సోలార్ ప్యానల్స్‌.. భారీగా పెరిగిన విద్యుత్‌ ఉత్పత్తి

Updated on: Nov 16, 2026 | 8:31 PM

అనాది కాలం నుంచి నేటి వరకు ప్రకృతి నుంచి మనిషి ఎన్నో అద్భుతమైన విషయాలను నేర్చుకుంటున్నాడు. ప్రకృతిలోని జీవుల నిర్మాణాలు, వాటి పనితీరును పరిశీలిస్తూ సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నాడు. తాజాగా ఇలాంటి ఆవిష్కరణే మరోటి పుట్టుకొచ్చింది. అవును తేనె టీగలు పెట్టే తెట్టే నిర్మాణం ఇంజినీర్లకు ఓ సరికొత్త ఐడియాను ఇచ్చింది.తేనెటీగల తుట్టె ఆకారాన్ని ఆధారంగా చేసుకుని సోలార్ ప్యానెళ్లకు సరికొత్త డిజైన్‌ను రూపొందించారు ఇంటజనీర్లు.. గతంలో పోల్చుకుంటే ఈ కొత్త డిజైన్‌తో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగినట్టు గుర్తించారు.

1 / 5
తేనె టీగలు పెట్టే తెట్టెను ఆధారంగా చేసుకొని సోలార్ ప్యానెళ్లకు సరికొత్త డిజైన్‌ తెచ్చారు ఇంజనీర్దు.. దీంతో పాత మొడల్ సోలార్ ప్యానల్లతో పోల్చుకుంటే ఈ కొత్త డిజైన్ ప్యానెళ్లు 142.3 శాతం ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు కనిపెట్టారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న  సోలార్ ప్యానెళ్లు సూర్యకిరణాలు పడే దిశగా పెట్టినప్పుడు మాత్రమే మెరుగ్గా పనిచేస్తాయి. కానీ సూర్యకిరణాలు వాలుగా పడినప్పుడు కొంత సూర్యరశ్మి ప్యానెల్ ఉపరితలంపై తాకి తిరిగి వెనక్కి వెళ్లిపోతుంది దీని వల్ల ఇవి సూర్యరశ్మి పూర్తి స్థాయిలో వినియోగించుకోలేవు. దీంతో విద్యుత్ ఉత్పత్తి కూడా తక్కువగా వస్తోంది.

2 / 5
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇంజనీర్లు తేనె టీగలు పెట్టిన తెట్టె ఆధారంగా త్రిమితీయ పుటాకార నిర్మాణంతో కూడిన కొత్త సోలార్ ప్యానెల్ డిజైన్‌ను రూపొందించారు. సాధారణంగా ఉండే చదునైన ఉపరితలానికి బదులుగా తేనెటీగల తుట్టెలాంటి నిర్మాణాన్ని ఇందులో ఉపయోగించారు. ఈ నిర్మాణంలోని వాలుగా ఉండే ఉపరితలాలు ప్రతిఫలించిన కాంతిని మరో దిశకు మళ్లిస్తాయి. దీంతో తిరిగి ప్రతిఫలించిన సూర్యకాంతి మరోసారి ప్యానెల్‌లోకి శోషించుకునే అవకాశం లభిస్తుంది. ఈ విధానం వల్ల కాంతి వృథా తగ్గి విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది.

3 / 5
ఈ కొత్త డిజైన్‌తో రూపొందించిన సోలార్ ప్యానెళ్ల పనితీరును ఇంజినీర్లు వివిధ కోణాల్లో  పరిశీలించగా.. సాధారణ సోలార్ ప్యానెళ్లతో పోలిస్తే  142.3 శాతం అధిక విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు తేలింది. సూర్యకాంతి సున్నా డిగ్రీల కోణంలో పడినప్పుడు కూడా ఈ కొత్త డిజైన్ ప్యానళ్లు విద్యుత్ ఉత్పత్తి చేశాయి.

4 / 5
ఈ కొత్త డిజైన్‌లో విద్యుత్‌ ఉప్పత్తి పెరిగేందుకు ప్రధాన కారణంగా.. తేనెటీగల తుట్టెలోని ఉపరితలం ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉండే షట్కోణ ఆకారంలో ఉంటుంది. ఈ డిజైన్‌లో తక్కువ పదార్థాన్ని ఉపయోగించి ఎక్కువ బలం, మెరుగైన నిర్మాణాన్ని అందించే ప్రత్యేకత ఈ ఆకారానికి ఉంది. ఇంజినీర్లు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అయి కొత్త డిజైన్‌ చేశారు. ఇందులో సులభంగా వంగే, ప్రింటింగ్ ద్వారా తయారు చేయగల పాలిమర్ ఆధారిత మెకానికల్ మెటామెటీరియల్‌ను వాడారు. ప్రత్యేక నమూనాల ద్వారా ఈ పదార్థం ఆకారాన్ని, దాని పనితీరును నియంత్రించే అవకాశం ఉంటుంది.

5 / 5
సాధారణంగా సోలార్ ప్యానెళ్లను ఎక్కువగా చదునైన పైకప్పులపైనే ఏర్పాటు చేస్తారు. కానీ ఈ కొత్త డిజైన్‌లోని వశ్యత కారణంగా వంగిన గోడలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్ పరికరాల్లోనూ వీటిని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తే సౌర విద్యుత్ వినియోగానికి మరిన్ని అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us