AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల లంచ్ బాక్స్‌లోకి నేతి బెల్లం సున్నుండలు.. రోజుకు ఒకటి పెట్టినా బలమే

ప్రతి తల్లి పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటుంది. అందుకోసమే వారికి పెట్టే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే చాలా మంది పిల్లలు తమ పిల్లల లంచ్ బాక్స్‌లో స్నాక్ కోసం ఏదో ఒకటి కొత్త రకం రిసిపీ పెట్టాలి అనుకుంటారు. అయితే అలాంటి వారు ఈ నేతి బెల్లం సున్నుండలు తయారు చేసి పెట్టడం వలన వారు చాలా ఆరోగ్యంగా ఉంటారంట. రోజుకు ఒకటి బాక్స్‌లో పెట్టినా, వారు తిని బలంగా తయారు అవుతారు.

Samatha J
|

Updated on: Sep 26, 2026 | 2:30 PM

Share
ఈ నేతి బెల్లం సున్నుండలు పిల్లల్లో ఐరన్ , కాల్షియాన్ని పెంచుతాయి. అందువలన పిల్లలు బలంగా ఉంటారు. నీరసం, ఆయాసం వంటి సమస్యలు దూరం అవుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాగా, మనం ఇప్పుడు సున్నుండలు ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం పదండి మరి.

1 / 5
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. పొట్టు లేని మినపగుళ్లు1 ¾ కప్పులు,   పొట్టుతో ఉన్న మినపప్పు ¼ కప్పు (మొత్తం రెండు కప్పులు), నెయ్యి యించడానికి 1 టీస్పూన్, సున్నుండలు చుట్టడానికి 1 కప్పు,  బియ్యం 2 టేబుల్ స్పూన్లు,  తురిమిన బెల్లం 2 కప్పులు ,   యాలకుల పొడి ½ టీస్పూన్

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో మినపప్పు పోసి మంచిగా వేయించుకోవాలి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దోరగా వేయించుకోవడం వలన సున్నుండలు మంచి రుచిగా ఉంటాయి. పప్పు చక్కగా వేగిన తర్వాత, అందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి, కేవలం ఒక నిమిషం పాటు వేయించాలి. బియ్యం కలపడం వల్ల సున్నుండలు నోటికి అంటుకుపోకుండా ఉంటాయి, అలాగే రుచి కూడా మెరుగుపడుతుంది. బాగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి.

3 / 5
పిండిపూర్తిగా చల్లారిన తర్వాత, ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని వీలైనంత మెత్తగా, సన్నని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో రెండు కప్పుల తురిమిన బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి వేసి చేతితో బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్లీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీని వలన సున్నుండలు సులభంగా చుట్టవచ్చును.

4 / 5
ఇప్పుడు సున్నుండల తయారీ కోసం పిండి సిద్ధంగా ఉంది. సున్నుండలు చుట్టడానికి నెయ్యిని వెచ్చగా కరిగించుకోవాలి. రెండు కప్పుల మినపపప్పుకు సుమారు ఒక కప్పు వేడి నెయ్యి అవసరం కావచ్చు. వెచ్చని నెయ్యిని పిండిలో కొద్దికొద్దిగా పోసుకుంటూ, బాగా కలిపి ఉండలు చుట్టాలి. ఉండలు రావడం కష్టం అనిపిస్తే, ఇంకొక రెండు, మూడు టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని కలుపుకోవచ్చు. రెండు చేతులతో గట్టిగా సున్నుండలను చుట్టాలి. అంతే బెల్లం సున్నుండలు రెడీ

5 / 5
Follow Us