3 / 5
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కుంకుమపువ్వును తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా కుంకుమపువ్వు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రీ-మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ సమస్యకు కుంకుమపువ్వు మేలు చేస్తుంది. అంటే రుతుక్రమం రాకముందే కలిగే మానసిక, శారీరక ఆనారోగ్యాన్ని కుంకుమపువ్వు దూరం చేస్తుంది. కాలు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలను నియంత్రిస్తుంది.