జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి ఇది అమృతమే..

Updated on: Feb 08, 2026 | 3:53 PM

అవకాడో, జామకాయ రెండూ ఆరోగ్యకరమైనవే. అయితే బడ్జెట్, సులభంగా లభించే సౌలభ్యాన్ని బట్టి చూస్తే జామకాయ భారతీయులకు ఒక వరం లాంటిది. ఖరీదైన పండ్ల వెనుక పరుగెత్తే కంటే మన చుట్టుపక్కల దొరికే జామ వంటి పండ్లతో అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు.

1 / 5
జామకాయలో విటమిన్-సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అవసరాలను ఒక జామకాయ సులభంగా తీరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ రంగు జామపండు ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

2 / 5
అవకాడో ధర ఎక్కువైనప్పటికీ, దానిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు దానికి ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో మంటను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ K, E, B-కాంప్లెక్స్ వంటి పోషకాలు అవకాడోలో సమృద్ధిగా ఉంటాయి.

3 / 5
మీరు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే.. అవకాడో కంటే జామకాయే మీకు సరైన ఛాయిస్. ఎందుకంటే.. జామకాయలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తింటే కడుపు నిండిన అనుభూతి కలిగి అతిగా తినకుండా అడ్డుకుంటుంది. దీనిలోని సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అంత త్వరగా పెంచవు.
అవకాడో ఆరోగ్యకరమే కానీ అందులో కేలరీలు జామకాయ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.

మీరు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నట్లయితే.. అవకాడో కంటే జామకాయే మీకు సరైన ఛాయిస్. ఎందుకంటే.. జామకాయలో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తింటే కడుపు నిండిన అనుభూతి కలిగి అతిగా తినకుండా అడ్డుకుంటుంది. దీనిలోని సహజ చక్కెరలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అంత త్వరగా పెంచవు. అవకాడో ఆరోగ్యకరమే కానీ అందులో కేలరీలు జామకాయ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి.

4 / 5
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మ సౌందర్యానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో జామకాయలోని విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. అవకాడో కూడా పోషకాలను ఇస్తుంది.. కానీ విటమిన్ సి, ఫైబర్ విషయంలో జామకాయే విజేతగా నిలుస్తుంది.

5 / 5