AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బార్మర్ టెంపుల్ టూర్‎కి వెళ్తే.. లైఫ్ లాంగ్ మెమొర సెట్ అయినట్టే..

28,387 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న బార్మర్ రాజస్థాన్‌లోని పెద్ద జిల్లాలలో ఒకటి. రాష్ట్రం పశ్చిమ భాగంలో ఉన్నందున, ఇది థార్ ఎడారిలో కొంత భాగాన్ని కలిగి ఉంటుంది.  ఇది పశ్చిమాన పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటుంది. వేసవిలో ఉష్ణోగ్రత 51 °C వరకు పెరుగుతుంది మరియు శీతాకాలంలో 0 °C వరకు పడిపోతుంది. ఈ జిల్లాలో పర్యాటక ప్రదేశాలు కూడా చాల  ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఈరోజు తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Oct 20, 2025 | 1:36 PM

Share
బార్మర్ ఫోర్ట్ & గర్ దేవాలయం: రావత్ భీమా 1552 ADలో ప్రస్తుత బార్మర్ నగరంలోని కొండ వద్ద బార్మర్ కోటను నిర్మించాడు. దీనిని బార్మర్ గర్ అని పిలుస్తారు. 1383 అడుగుల కొండపై 676 అడుగుల ఎత్తులో కోటను నిర్మించాడు.బార్మర్ కోట కొండ రెండు ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను కలిగి ఉంది. కొండ పైభాగంలో 1383 ఎత్తులో ఉన్న జోగ్మయా దేవి (గర్ మందిర్) ఆలయం ఉంది. 500 అడుగుల ఎత్తులో నాగ్నేచి మాత ఆలయం ఉంది. రెండు ఆలయాలు చాలా ప్రసిద్ధి చెందాయి. నవరాత్ర ఉత్సవాల సమయంలో ఉత్సవాల చేస్తారు.

1 / 5
దేవక-సూర్య దేవాలయం: ఈ ఆలయాన్ని 12వ లేదా 13వ శతాబ్దంలో నిర్మించారు. బార్మెర్ నుండి 62 కి.మీ.ల దూరంలో బార్మర్-జైసల్మేర్ రోడ్డు వెంబడి ఉన్న దేవ్కా అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో గణేశుడి రాతి శిల్పాలు ఉన్న మరో రెండు దేవాలయాల శిధిలాలు కూడా ఉన్నాయి.

2 / 5
కిరడు దేవాలయాలు: బార్మర్ నుండి 35 కి.మీ దూరంలో, థార్ ఎడారి సమీపంలో ఉన్న పట్టణంలో కిరాడు దేవాలయాలు అని పిలువబడే 5 దేవాలయాలు ఉన్నాయి. సోలంకి నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాలు అద్భుతమైన శిల్పాలను కలిగి ఉన్నాయి. ఈ ఆలయాలు శివునికి అంకితం చేయబడ్డాయి. ఐదు దేవాలయాలలో సోమేశ్వరాలయం చాలా విశేషమైనది.

3 / 5
రాణి భటియాని ఆలయం: ఈ ఆలయం జసోల్‌లో ఉంది. ఆమె మంగనియార్‌కు దివ్య దర్శనం ఇచ్చినట్లు చెప్పబడినందున ఆమెను మంగనియర్ బార్డ్ కమ్యూనిటీ ప్రత్యేకంగా పూజిస్తారు. చాలామంది ఈ దేవతను మజిసా లేదా తల్లి అని కూడా పిలుస్తారు. ఆమె గౌరవార్థం పాటలు పాడతారు. పురాణాల ప్రకారం, ఆమె దేవతగా మారడానికి ముందు స్వరూప అనే రాజపుత్ర యువరాణి.

4 / 5
శ్రీ నకోడ జైన్ దేవాలయం: 3వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం అనేక సార్లు పునర్నిర్మించబడింది. 13వ శతాబ్దంలో అలంషా ఈ ఆలయాన్ని ఆక్రమించి దోచుకున్నాడు. కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో దాచిన విగ్రహాన్ని దొంగిలించడంలో విఫలమయ్యాడు. 15వ శతాబ్దంలో విగ్రహం తిరిగి తీసుకొచ్చి ఆలయాన్ని పునరుద్ధరించారు.

5 / 5