అరెరే ఈ ఫీచర్‌ గురించి ఇన్నాళ్లు తెలీదే.. పార్క్‌ చేసిన కారు లోకేషన్ తెలుసుకోవడం ఇంత ఈజీనా!

Updated on: Sep 07, 2026 | 1:26 PM

మనం ఎక్కడికైనా పెద్ద పెద్ద మాల్స్ లేదా అపార్ట్‌మెంట్స్‌, పార్కింగ్ ఏరియాలకు వెళ్లినప్పుడు వాహనం ఎక్కడ పార్క్ చేశామో మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే పార్కింగ్ ఏరియాలో అన్ని మార్గాల ఒకేలా ఉంటాయి. అందుకే పార్క్ చేసిన వాహనం దగ్గరకు వెళ్లేందుకు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది చికాకు తెప్పించడమే కాకుండా భద్రతా సమస్యలకు కూడా దారితీస్తుంది. కానీ మీ మోబైల్ ఉండే ఓ ట్రిక్‌ ఉపయోగించి మీ వాహనాన్ని ఎక్కడ పార్క్ చేశారో తెలుసుకోవచ్చు.. క్షణాల్లో దాని దగ్గరకు వెళ్లి పోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
పార్కింగ్‌ మీరు కార్ ఎక్కడుందో తెలుసుకోవడానికి మీ ఫోన్‌లో ఉండే గూగుల్ మ్యాప్స్ చాలా బాగా యూజ్ అవుతుంది. అవును గూగుల్ మ్యాప్స్‌లో ఉండే సేవ్ యువర్ పార్కింగ్ అనే ఫీచర్‌తో మీ కారు ఉన్న ప్రదేశాన్ని ఈజీగా గుర్తించుకోవచ్చు. దీన్ని ఉపయోగించి మీరు కారును వెతకాల్సిన పనిలేకుండా మ్యాప్స్ పెట్టుకొని ఈజీగా దాని దగ్గరకు చేరుకోవచ్చు. మరి ఈ ఫీచర్‌ను ఎలా వాడాలో అనేగా మీ డౌట్.. అయితే చూద్దాం పదండి.

2 / 5
మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ గనుకు ఉంటే అందులో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మీ ఫోన్‌లో లోకేషన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేసి స్క్రీన్‌పై మీ ప్రస్తుత లొకేషన్‌ను చూపే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక మెనూ కనిపిస్తుంది, అందులో సేవ్ పార్కింగ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. వెంటనే మ్యాప్‌పై P అనే పార్కింగ్ గుర్తు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు కారు పార్క్ చేసిన పిల్లర్ నెంబర్, ఫోర్ డీటెయిల్స్ సెట్‌ చేసుకోవచ్చు. అలాగే కారు పార్క్ చేసిన ప్రదేశం ఫోటోను కూడా యాడ్ చేయవచ్చు.

3 / 5
అదే మీరు ఐఫోన్ గనుక వాడుతుంటే.. మీ ఐఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి, GPS ఆన్ చేసి ఉంచండి. అప్పుడు మీరున్న ప్లేస్‌ను చూపించే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే పాప్-అప్ మెనూ నుండి 'Set as parking location' లేదా 'Saved parking'ను ఎంచుకోండి. దీంతో మీ లొకేషన్ సేవ్ అవుతుంది. అవసరమైతే ఇందులో నోట్స్ లేదా పార్కింగ్ టైం అండ్ వివరాలు కూడా యాడ్ చేసుకోవచ్చు.

4 / 5
సేవ్ చేసిన కారు లొకేషన్‌ను ఎలా కనుగొనాలి?: మీ పని ముగించుకొని మీరు తిరిగి వాహనం వద్దకు వెళ్లాలనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో 'Saved parking' అని సెర్చ్ చేయండి.. అక్కడ వచ్చిన ఆప్షన్ పై క్లిక్ చేస్తే డైరెక్షన్ లేదా స్టార్ట్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు మీ కారు ఉన్న లోకేషన్ చూపిస్తుంది. ఆ రూట్‌లో వెళ్తే మీరు ఈజీగా మీ కారు వద్దకు వెళ్లొచ్చు.

5 / 5
మీరు ఇక మీ వాహనం వద్దకు చేరుకున్నాక మ్యాప్స్ ఓపెన్ చేసి Clear పై ట్యాప్ చేసి ఆ పార్కింగ్ పిన్‌ను తీసివేయవచ్చు. అంతే ఈ చిన్న ట్రిక్ తెలిస్తే ఈ సారి మీరు పార్కింగ్ వెళ్లినప్పుడు మీ కారు ఎక్కడుందో అని వెతుక్కోవాల్సిన పనిలేదు. ఈజీగా ఈ ట్రిక్ ఉపయోగించి కనుక్కోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us