వారంలో కనీసం ఒక్కసారైనా చాలా మంది గ్యాస్ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ సమస్య బాగా ఎక్కువైపోయింది. సమయానికి తినకపోయినా, మసాలా వంటలు, కూల్ డ్రింక్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తింటే గ్యాస్ ప్రాబ్లమ్ తలెత్తుతుంది.
గ్యాస్ కారణంగా గొంతులో, ఛాతీలో మంట తలెత్తుతుంది. ఒక్కోసారి తిన్న ఆహారం కూడా వాంతులు అయిపోతాయి. గ్యాస్ సమస్యను కంట్రోల్ చేయడంలో నీళ్లు చక్కగా పని చేస్తాయి. గ్యాస్ సమస్య రాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి.
గ్యాస్ సమస్య ఉన్నవారు కంట్రోల్ అవ్వాలంటే ఎక్కువ సేపు కూర్చొని ఉండాలి. దీని వల్ల గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది. పడుకున్నా గ్యాస్ పైకి రావచ్చు. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల గ్యాస్ కాస్త కంట్రోల్ అవుతుంది.
గ్యాస్ సమస్య తగ్గాలంటే.. సోడా తాగడండి. సోడా అనేది గ్యాస్‌ని తగ్గిస్తుంది. అయితే ఇది కొందరిలో మాత్రమే పని చేస్తుంది. కాబట్టి పడేవారు తాగవచ్చు. కలబంద జ్యూస్ తాగినా గ్యాస్ అదుపులోకి వస్తుంది.
నిమ్మకాయ రసాన్ని తాగినా, ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, మజ్జిగ, అరటి పండు, ద్రాక్ష పండు తిన్నా వెంటనే గ్యాస్ తగ్గుతుంది. జీరా వాటర్, పుదీనా నీళ్లు, వేడి నీళ్లు తాగినా గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)