Curd Combination Foods: పెరుగుతో పాటు ఈ ఫుడ్స్‌ని కలిపి తింటే అంతే సంగతులు.. జాగ్రత్త!

| Edited By: Ravi Kiran

Jan 23, 2025 | 9:33 PM

సాధారణంగా మనకు తెలియకుండానే కొన్ని రకాల ఫుడ్ కాంబినేషన్స్ తింటూ ఉంటారు. ఇలా కొన్ని రకాల ఆహారాలను పెరుగుతో కలిపి అస్సలు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి. మరి అవేంటో చూడండి..

1 / 5
ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జుట్టుకు, చర్మానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. కానీ పెరుగుతో కలిపి కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు.

2 / 5
చాలా మంది పెరుగు అన్నంతో కలిపి చేపలను తింటూ ఉంటారు. ఇలా అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది. చేపలతో భోజనం చేస్తే.. మజ్జిగ కూడా తీసుకోకూడదు. ఈ రెండింటిని కలిపి తింటే చర్మ సమస్యలు, దద్దుర్లు, అలెర్జీ వంటివి రావచ్చు.

3 / 5
పెరుగుతో కలిపి మామిడి ముక్కలు తింటారు. పెరుగు అన్నంతో కూడా నంచుకుని తింటారు. ఇవి తినడానికి రుచిగా ఉన్నా.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీని వల్ల అజీర్తి, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. పీహెచ్ లెవల్స్ ఇన్ బ్యాలెన్స్ అవుతాయి.

4 / 5
పెరుగు, మజ్జిగ అన్నంతో ఉల్లిపాయ కూడా కలిపి తింటారు. ఇలా తినేవారు గ్రామాల్లో ఎక్కువగా ఉంటారు. పెరుగుతో ఉల్లిపాయ తినకూడదు. ఈ రెండింటినీ కలిపి తిన్నా అజీర్తి, గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు.

5 / 5
వంకాయ, టమాటా వంటి కూరగాయాల కాంబినేషన్‌తో కూడా పెరుగు కలిపి తినకూడదు. దీని వల్ల కూడా పొట్ట ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇలాంటి కాంబినేషన్ల ఫుడ్ వల్ల పేగులపై కూడా ఎఫెక్ట్ పడి.. అజీర్తి సమస్యలు రావచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

వంకాయ, టమాటా వంటి కూరగాయాల కాంబినేషన్‌తో కూడా పెరుగు కలిపి తినకూడదు. దీని వల్ల కూడా పొట్ట ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇలాంటి కాంబినేషన్ల ఫుడ్ వల్ల పేగులపై కూడా ఎఫెక్ట్ పడి.. అజీర్తి సమస్యలు రావచ్చు. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)