Banana: రోజుకి ఒక అరటి పండు తింటే.. ఆకలి తీర్చడమేకాదు ఆరోగ్యానికి శ్రీరామ రక్ష..!

|

Nov 25, 2024 | 9:59 PM

అరటి పండు..మంచి పోషకాల గని..అందుకే అరటిపండును పేదవాడి యాపిల్‌గా పిలుస్తారు. శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. రోజుకు ఒక అరటిపండు తింటే మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటి పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
అరటి పండులో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ప్రతి రోజు ఒక అరటి తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారు రోజు అరటి తినడం చాలా మంచిది. మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అరటిపండు మన శరీరంలో త్వరిత శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.

2 / 5
అరటి పండులో గ్లూకోజ్ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని నుండి మన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అరటిపండు జీర్ణక్రియను బలోపేతం చేయడానికి ఉత్తమమైన పండుగా చెబుతున్నారు నిపుణులు. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి అరటిపండు చాలా మేలు చేస్తుంది.

3 / 5
అరటిపండులో ఫైబర్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపు ఆరోగ్యాన్ని నియంత్రిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు రోజుకు ఒక అరటిపండు తింటే మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

4 / 5
అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరమైన ఖనిజంగా పరిగణించబడుతుంది. ఒక నెల రోజుల పాటు ప్రతిరోజూ అరటిపండు తింటే, మీ గుండె మంచి ఆరోగ్యాన్ని మీరు గమనించవచ్చు. అరటిపండు మీ మనస్సుతో పాటు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అరటి పండులో ఉండే విటమిన్ ʼCʼ మెదడు ఆరోగ్యానికి తోడ్పడే సెరోటోనిన్‌ని విడుదల చేస్తుంది.

5 / 5
అరటిపండులో మాంగనీస్ ఉంటుంది. ఇది చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తుంది.  అరటిపండులో విటమిన్ బి6 ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఒక మీడియం సైజ్ అరటిపండు తింటే, అది మీ శరీరానికి కావలసిన విటమిన్ బి6ని అందిస్తుంది.