Tiredness: ఏ పని చేయకపోయినా తరచూ నీరసంగా అనిపిస్తుందా? జాగ్రత్త అశ్రద్ధ తగదు..

|

Nov 08, 2024 | 1:37 PM

కొంత మంది ఏ పని చేయకపోయినా చాలా అలసి పోయినట్లు, నీరసంగా కనిపిస్తారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రమాదకర వ్యాధులకు ఇది సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు..

1 / 5
బ్రేక్‌ తీసుకోకుండా పని చేస్తే శరీరం అలసిపోవడం సహజం. కానీ కొన్నిసార్లు ఏ పని చేయకపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇదేమంత పెద్ద సమస్య కాదని మీరు అనుకుంటున్నట్లయితే తప్పులో కాలేస్తున్నట్లే. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది ఏదో ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కాబట్టి మీరు కూడా ఇలాంటి లక్షణాలను అనుభవించినప్పుడు దానిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
కొంతమందికి అకస్మాత్తుగా శ్వాస పెరగడం లేదా శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో బిగుతుగా మారడం, ఎలాంటి పని చేయకుండా తరచుగా అలసిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని బెంగళూరుకు చెందిన డాక్టర్‌ పంకజ్ వర్మ చెబుతున్నారు. అసలిలా ఎందుకు జరుగుతుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం..

3 / 5
శరీరంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు, ఆక్సిజన్ ప్రవాహం తగ్గుతుంది. ఇది శ్వాస తీసుకోవడం కూడా కష్టతరం చేస్తుంది.

4 / 5
 గుండె సరిగ్గా పని చేయకపోయినా, ఆక్సిజన్ శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా చేరదు. హార్ట్ వాల్వ్ ఫెయిల్యూర్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన అలసటకు కారణమవుతాయి. అధిక ఒత్తిడి కండరాల నొప్పులకు కారణమవుతుంది. దీని వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి.

5 / 5
దీని నుంచి బయటపడాలంటే ఆహారంలో ఐరన్, విటమిన్ B-12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. శ్వాస వ్యాయామాలు చేయడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయినా శ్వాసకోశ సమస్యను ఎదుర్కొంటుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయాలి. యోగాసనాలు కూడా వేయవచ్చు.