AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటిపండు తింటే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..? మీకు తెలియని నిజాలు ఇవే..

బరువు తగ్గాలని డైట్ మొదలుపెట్టగానే మనలో చాలామంది అందరికంటే ముందుగా పక్కన పెట్టేసే పండు అరటిపండు. అరటిపండు తింటే లావైపోతాం అని కొందరు భయపడుతుంటే, జిమ్‌కు వెళ్లేవారు మాత్రం ఎనర్జీ కోసం ఒకేసారి రెండు మూడు అరటిపండ్లు లాగించేస్తుంటారు. ఇంతకీ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? లేక తగ్గుతారా? ఈ విషయంలో ప్రముఖ డైటీషియన్లు చెబుతున్న అసలు నిజం తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

Krishna S
|

Updated on: Nov 14, 2026 | 7:12 PM

Share
బరువు తగ్గాలంటే ఎలాంటి అరటిపండు తినాలి?: అరటిపండు బరువు తగ్గడానికి కచ్చితంగా సహాయపడుతుంది.. కానీ అది ఎంతవరకు పండింది అనే దానిపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు పూర్తిగా పండిన పసుపు రంగు అరటిపండ్లకు బదులుగా, కొద్దిగా పచ్చిగా ఉండే అరటిపండ్లను తినడం ఉత్తమం. వీటిలో రెసిస్టెంట్ స్టార్చ్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగి ఆకలి అదుపులో ఉంటుంది.

1 / 5
షుగర్ ఉన్నవారు జాగ్రత్త.. బాగా పండినవి వద్దు: అరటిపండులోని ఆరోగ్య ప్రయోజనాలు అది పండిన స్థాయిని బట్టి మారుతుంటాయి. మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు బాగా పండిన, నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే బాగా పండిన పండ్లలో సహజ చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉండి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తుంది. అలాంటి వారు కొద్దిగా పచ్చగా ఉండే అరటిపండ్లను మితంగా తీసుకోవడం వల్ల అందులోని పొటాషియం, ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తాయి.

2 / 5
బరువు పెరగడానికి అసలు కారణం ఇదే: కేవలం అరటిపండ్లు తినడం వల్లే ఎవరూ లావైపోరని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన శరీర బరువు పెరగడం లేదా తగ్గడం అనేది మనం రోజంతా తీసుకునే మొత్తం కేలరీలు, ఆహార పరిమాణంపై ఆధారపడి ఉంటుంది తప్ప ఏ ఒక్క పండు మీదో కాదు. సమతుల్య ఆహారం లేకుండా ఏ పదార్థాన్ని అతిగా తిన్నా కేలరీలు పెరిగి బరువు పెరుగుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు శక్తి కోసం వర్కవుట్‌కు ముందు లేదా తర్వాత 1 నుంచి 2 అరటిపండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.

3 / 5
ఆకలిని తగ్గించే బెస్ట్ కాంబినేషన్స్: అరటిపండును ఒంటరిగా కాకుండా ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే పదార్థాలతో కలిపి తింటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అరటిపండుతో పాటు పీనట్ బటర్, గ్రీక్ యోగర్ట్ , లేదా బాదం, వాల్‌నట్స్ వంటి ఎండు ఫలాలు, విత్తనాలను కలిపి తీసుకోవాలి. ఈ కాంబినేషన్లు జీర్ణక్రియను నెమ్మదింపజేసి, తరచుగా వచ్చే ఆకలిని అణచివేయడమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి.

4 / 5
మితంగా తింటేనే అమృతం: మొత్తానికి బరువు తగ్గే ప్రయాణంలో అరటిపండు మనకు శత్రువు కాదు, అలాగని బరువు పెంచే షార్ట్‌కట్ కూడా కాదు. సరైన సమయంలో, సరైన పరిమాణంలో, సరైన ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు అరటిపండు ఒక అద్భుతమైన పోషకాహారంగా పనిచేస్తుంది. కాబట్టి డైట్ పేరుతో అరటిపండును పూర్తిగా దూరం పెట్టకుండా, మితంగా తీసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడమే అసలైన మంత్రం.

5 / 5
Follow Us