iPhone: ఐఫోన్‌లో ఈ అద్భుత ఫీచర్ గురించి తెలుసా..? తెలిస్తే మీ పైసలు ఆదా..

Updated on: Aug 12, 2025 | 7:50 AM

ఐఫోన్ పాడయ్యే ముందు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. కానీ చాలా మంది వాటిని పట్టించుకోరు. మీరు చిన్న టిప్స్ పాటిస్తే మీ ఫోన్‌కు ఎటువంటి సమస్య ఉండదు. మీ ఫోన్‌లో దాగి ఉన్న ఒక ఫీచర్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు ఆ ఫోన్ వాడాలని అనుకుంటారు. కానీ దాన్ని రేట్ ఎక్కువ కావడంతో వెనకడుగు వేస్తుంటారు. దానిలోని సేఫ్టీ ఫీచర్స్ వల్లే సెలబ్రిటీలు సైతం ఐఫోన్‌ను వాడుతుంటారు. ఐఫోన్‌లో ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఒకటి ఫోన్ బ్యాటరీ పాడయ్యే ముందు అది కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియక..వాటిని విస్మరిస్తుంటారు.

2 / 5
బ్యాటరీ త్వరగా అయిపోతుందా? : మీ ఐఫోన్ బ్యాటరీ గతం కంటే ఫాస్ట్‌గా అయిపోతుంటే.. అది బ్యాటరీ పాడవుతోందని అర్థం. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు.. దీనికి ముందు ఐఫోన్ కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఐఫోన్ సెట్టింగ్‌లలో బ్యాటరీ విభాగంలో బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది బ్యాటరీ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. చాలామంది ఈ ఫీచర్‌ను పెద్దగా పట్టించుకోరు.. కానీ ఇది బ్యాటరీ పాడయ్యే ముందు మనకు హెచ్చరిక ఇస్తుంది.

3 / 5
బ్యాటరీ హెల్త్ అంటే ఏంటీ? : బ్యాటరీ హెల్త్ మీ ఐఫోన్ బ్యాటరీ ప్రస్తుత స్థితిని సూచిస్తుంది. మీరు ఫోన్‌ను ఉపయోగించిన కొద్దీ, దాని బ్యాటరీ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. కొత్త ఐఫోన్ కొన్నప్పుడు బ్యాటరీ సామర్థ్యం 100శాతం ఉంటుంది. ఇది క్రమంగా తగ్గుతుంది. బ్యాటరీ హెల్త్ 80శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు, బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి.

4 / 5
రీసేల్ రేట్‌‌పై ప్రభావం : మీరు మీ ఐఫోన్‌ను అమ్మాలనుకున్నప్పుడు.. బ్యాటరీ హెల్త్ దాని రీసేల్ విలువను ప్రభావితం చేస్తుంది. కొనేవారు బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసి.. అది 80శాతం లేదా అంతకంటే తక్కువ ఉంటే బ్యాటరీని మార్చాల్సి వస్తుంది కాబట్టి ఫోన్‌కు మీరు ఆశించిన ధర రాకపోవచ్చు.

5 / 5
బ్యాటరీ హెల్త్‌ను ఇలా కాపాడుకోండి : ఐఫోన్‌ను ఛార్జ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాటరీని 20శాతం కంటే తక్కువగా పడిపోనివ్వకుండా, 80శాతం కంటే ఎక్కువగా ఛార్జ్ చేయకుండా చూసుకోవాలి. ఈ నియమాన్ని పాటించడం వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ఈ నియమాన్ని పట్టించుకోకుండా ఛార్జ్ చేస్తే, బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుంది.