AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 రోజులు ఇలా చేస్తే.. నరాలలోని గ్యాస్ కూడా పూర్తిగా తొలగిస్తుంది

నరాలలోని గ్యాస్, కడుపు వాయువు, పొట్ట ఉబ్బరం, ఛాతిలో అసౌకర్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇవి కేవలం కడుపుకే పరిమితం కాకుండా మొత్తం శరీరంపై ప్రభావం చూపుతాయి. ఈ సమస్యలకు ప్రధాన కారణాలను తెలుసుకోవడంతో పాటు, మందులు వాడకుండా సహజసిద్ధమైన పద్ధతులు గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 26, 2026 | 2:56 PM

Share
చాలా మంది ఉదయం అల్పాహారాన్ని తేలికగా తీసుకుని, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అధికంగా తింటుంటారు. సరైన సమయంలో తినకపోవడం, ముఖ్యంగా రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక సమస్యలు ఆహారాన్ని సరిగా నమలకుండా వేగంగా తినడం వలన గాలిని అధికంగా మింగుతారు. ఇది కడుపులో గ్యాస్‌కు దారితీస్తుంది. ఫోన్ చూస్తూ లేదా పనిచేస్తూ తినడం కూడా ఈ అలవాటుకు కారణమవుతుంది.

1 / 5
ఒకేసారి అధిక మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. కడుపు పూర్తిగా నిండేవరకు తినకుండా, కొంత ఖాళీ ఉంచుకోవడం మంచిది.ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కొవ్వు ఉన్న పదార్థాలు, మసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు విపరీతంగా తీసుకోవడం వల్ల అసిడిటీ పెరుగుతుంది మరియు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

2 / 5

కావాల్సిన పదార్థాలు:  ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర , ఒక స్పూన్  వాము ,  ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాసు నీటిలో పైన చెప్పిన నాలుగు పదార్థాలను కలిపి, రాత్రంతా నానబెట్టాలి.ఉదయాన్నే నిద్రలేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండి పరగడుపున తాగండి. ఇది మీ పొట్టను శుభ్రపరుస్తుంది.అల్పాహారం చేసిన తర్వాత, రాత్రి నానబెట్టిన ధనియాలు, జీలకర్ర, వాము, మెంతుల నీటిని వడగట్టి తాగండి.

3 / 5
వడగట్టిన పదార్థాలను పారవేయకుండా, మళ్ళీ అదే గ్లాసులో వేసి మరో గ్లాసు నీటిని పోసి కలిపి మూతపెట్టండి. దీన్ని సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత తాగవచ్చు. ఇది రాత్రి భోజనం సరిగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.ఈ పద్ధతిని క్రమం తప్పకుండా 7 రోజుల పాటు పాటించడం వల్ల మీ పేగులు శుభ్రపడతాయి, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుండి పూర్తి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
మీ రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు అధికంగా ఉంటే, తాజా ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోండి. రాత్రిపూట డిన్నర్‌లో పండ్లను తీసుకోవడం వల్ల పేగులు బాగా శుభ్రపడతాయి.ఆహారం తింటున్నప్పుడు అధికంగా నీరు త్రాగే అలవాటును తగ్గించుకోండి. భోజనానికి ముందు లేదా తర్వాత నీరు త్రాగడం మంచిది.

5 / 5
Follow Us