
స్టార్ హీరోలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా చాలా మంది తమ అభిమాన హీరో ఫొటోలు చూడటానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. అయితే నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఫొటో ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చేతిలో బ్యాట్, సింపుల్ లుక్‌లో ఉన్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? అంటూ కొందరు ఫొటోలను వైరల్ చేస్తున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే?

బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్న, ఈ హీరో ఎవరో కాదు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. వరస సినిమాలతో, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడానికి రెడీ అయిపోయాడు.

మహేష్ బాబు నీడ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. బాల నటుడిగా చాలా సినిమాల్లో నటించి, తన అద్భుతమైన నటనతో ఎంతో మంది మదిని దోచుకున్నాడు. పలు సినిమాలకు అవార్డులు సైతం అందుకున్నాడు. ఇక తర్వాత 1999లో రాజకుమారుడు మూవీతో ఏకంగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు. ఈ మూవీ అంగా హిట్ కానప్పటికీ, మహేష్ బాబుకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఇక తర్వాత మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

తర్వాత చాలా సినిమాల్లో నటించి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు, ఇక పోకిరి మూవీతో ఏకంగా స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ హీరో రాజమౌళి దర్శకత్వంలో వారణాసి మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. దీంతో మహేష్ బాబు గ్లోబల్ స్టార్‌గా మారనున్నాడు, ఇక ఈ మూవీ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.