- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress nandita swetha shared her latest saree photos
చీరకట్టులో కుర్ర భామ.. నందిత అందాలకు ఎవరైనా పడిపోవాల్సిందే..
చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు. తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసు కదా.. ఆమె నందిత శ్వేతా.
Updated on: Sep 15, 2025 | 2:00 PM

చాలా మంది ముద్దుగుమ్మలు అందం అభినయం ఉన్న అవకాశాలు అందుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న బ్యూటీలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు.

తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసు కదా.. ఆమె నందిత శ్వేతా. ఈ చిన్నది.. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ.

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. 2016లో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నందిత శ్వేత పేరు మారుమ్రోగింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది.

ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. టాలీవుడ్ లో బ్యాక్ బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఆతర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమకథ చిత్రం 2 సినిమాల్లో నటించింది. కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ క్రేజీ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది ఈ వయ్యారి భామ. ఇక సోషల్ మీడియాలో రకరకాల ఫొటోలతో ఆకట్టుకుంటుంది నందిత. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ కుర్రదాని ఫోటోలు వైరల్ అవుతున్నాయి




