కంగువా, వేట్టయన్‌ సినిమాల ఎఫెక్ట్‌.. ఇకపై థియేటర్లలోకి వారికి నో ఎంట్రీ

|

Nov 22, 2024 | 9:45 PM

సినిమా వర్సెస్ రివ్యూ వివాదం మరింత ముదురుతోంది. తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చిన కంగువా సినిమా విషయంలో రివ్యూలు ఎక్కువగా నష్టం కలిగించాయని భావించిన తమిళ్ ఫిలిం యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌ థియేటర్ల యాజమాన్యాలకు కొన్ని ఆదేశాలిచ్చింది.

1 / 5

2 / 5
ఇటీవల రివ్యూల కారణంగా నష్టపోయిన సినిమాల విషయంలో ఓ మీటింగ్‌ నిర్వహించిన తమిళ్‌ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోషియేషన్‌, పరిశ్రమ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించింది.

3 / 5
కంగువాతో పాటు వేట్టయన్, ఇండియా 2 సినిమాల ఫలితం విషయంలోనూ పబ్లిక్ టాక్‌, యూట్యూబ్‌ రివ్యూ ప్రభావం చాలా ఎక్కవగా ఉందని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

4 / 5
తమిళ సినిమా పరిశ్రమ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలు, యూట్యూబ్ ఛాన్సల్ సినిమా హాల్ ప్రాంగణాల్లోకి అనుమతించకూడదని సూచించింది. ముఖ్యంగా ఫస్ట్‌ డే ఫస్ట్ షో సమయంలో థియేటర్ల దగ్గర పబ్లిక్‌ టాక్ తీసుకునేందుకు, రివ్యూలు ఇచ్చేందుకు అవకాశం కల్పించకూడదని కోరింది.

5 / 5
రివ్యూల పేరుతో నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక  నిపుణుల మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రొడ్యూసర్స్ అసోషియేషన్‌. ఈ నిర్ణయం మీదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రాక్టికల్‌గా ఈ నిర్ణయాల అమలు ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి.